అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

YS Jagan is a most popular chief minister - Sakshi

రాష్ట్రంలో పాలనపై 71 శాతం మంది ప్రజల్లో సంతృప్తి

వీడీపీ అసోసియేట్స్‌ సంస్థ సర్వేలో వెల్లడి

మోస్ట్‌ పాపులర్‌ సీఎంలలో వైఎస్‌ జగన్‌కు మూడో స్థానం

1, 2వ స్థానాల్లో నవీన్‌ పట్నాయక్, యోగి ఆదిత్యనాథ్‌ 

సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన మూడు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చోటు సాధించారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ముఖ్యమంత్రిగా జగన్‌ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజల మనసును చూరగొన్నాయి. దేశవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన సీఎంలపై ప్రఖ్యాత ‘వీడీపీ అసోసియేట్స్‌’ సంస్థ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మూడో స్థానం లభించింది. ‘దేశ్‌కా మూడ్‌’ పేరుతో ప్రస్తుతం దేశ ప్రజల నాడి – రాజకీయంగా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వీడీపీ అసోసియేట్స్‌ ఈ సర్వేను నిర్వహించింది. 71 శాతం మంది ప్రజలు జగన్‌ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ప్రజా నాయకుడిగా ఎదిగి అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే వైఎస్‌ జగన్‌కు ఇలాంటి గౌరవం దక్కడం విశేషం.  

మోస్ట్‌ పాపులర్‌ సీఎం నవీన్‌ పట్నాయక్
దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 11,252 మంది సర్వేలో పాల్గొనగా వారిలో 10,098 మంది ఓటర్లున్నారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 14 వరకు ఈ సర్వే నిర్వహించారు. సర్వే వివరాల ప్రకారం మోస్ట్‌ పాపులర్‌ సీఎంల జాబితాలో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్ అగ్రభాగాన నిలిచారు. ఆయనకు 81 శాతం మంది మద్దతు లభించింది. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ 72 శాతంతో రెండో స్థానంలో, వైఎస్‌ జగన్‌ 71 శాతం మంది ప్రజల మద్దతుతో మూడో స్థానంలో ఉన్నారు.

నవరత్నాలకు జాతీయ స్థాయిలో స్పందన 
సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు’ కార్యక్రమంలోని సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పథకాలు జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని, అధికారం చేపట్టిన 3 నెలల్లోనే ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను అమలు చేసేందుకు జగన్‌ తీసుకుంటున్న కీలక నిర్ణయాలే ఆయన పాలనపై ప్రజల్లో విశ్వాసం పెంచిందనే అభిప్రాయం  వ్యక్తం అవుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా ఆయనకు ఖ్యాతి తెచి్చందని పేర్కొంటున్నారు. ప్రజలు నమ్మకంతో అప్పగించిన అధికారాన్ని సది్వనియోగం చేసుకుంటూ వారి సంక్షేమానికి జగన్‌ కృషి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top