వైఎస్‌ జగన్‌ దాతృత్వం

YS jagan Helps Children Brain Surgery - Sakshi

చిన్నారుల ప్రాణాలు కాపాడిన జననేత

రెండు కుటుంబాల్లో సంతోషం

పశ్చిమగోదావరి, దెందులూరు: పాదయాత్ర... ఓ చల్లని మనస్సు దాతృత్వం ఒకే గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లో శాశ్వత ఆనందాన్ని నింపింది.  ఒకరు ఆరేళ్ల బాలుడు మణికంఠ కాగా.. .. మరొకరు నెలలు నిండని చిన్నారి.. ఇద్దరిదీ ఒకటే సమస్య తలలో నీరు పట్టింది.. ఇద్దరిదీ ఒకటే గ్రామం. పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మండలం సీతంపేట. గ్రామానికి చెందిన సాయి మణికంఠ, పొలుకొండ ప్రసాద్, శ్రావణి దంపతుల నెలల నిండని చిన్నారి. ఇద్దరూ తలలో మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో రెండు కుటుంబాలు తమ శక్తికి మించి ఖర్చు పెట్టాయి. సాయిమణికంఠకు రూ.ఆరు లక్షలు అవుతాయని, ప్రసాద్, శ్రావణి దంపతుల చిన్నారికి రూ.13 లక్షలతో అపరేషన్‌ చేయాలని పరీక్షలు చేసిన వైద్యులు చెప్పటంతో ఆ రెండు కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. ఏం చేయాలో తెలియక కన్నీటి పర్యంతమయ్యాయి. ఇదే సమయంలో దెందులూరు మండలం శ్రీరామవరంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మణికంఠ తల్లిదండ్రులు కలసి సమస్యను వివరించారు.

వెంటనే రూ.ఆరు లక్షలతో పెద్ద తిరుపతిలో వైద్య చేయించేందుకు అంగీకరించి నగదును వైద్యశాలకు చెల్లించి సాయిమణికంఠకు చికిత్స చేయించారు. గత నెలలో శ్రీకాకుళంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ వద్దకు సీతంపేట గ్రామానికి చెందిన ప్రసాద్, శ్రావణిలు నెలలు నిండని చిన్నారిని తీసుకువెళ్లి సమస్యను వివరించారు. చలించిపోయిన ఆయన చిన్నారిని కాపాడేందుకు రూ.13 లక్షలతో చిన్నారి మెదడుకు ఆపరేషన్‌  చేయించారు. ఇప్పుడు ఆ ఇద్దరు చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నారు.  సోమవారం వైఎస్సార్‌ సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్‌ కొఠారు అబ్బయ్య చౌదరి చిన్నారి తల్లిదండ్రులను కలసి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రెండు కుటుంబాల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.  కన్వీనర్‌ వెంట పార్టీ రాష్ట్ర యువజన విభాగం జనరల్‌సెక్రటరీ కామిరెడ్డి నాని, మెండెం ఆనంద్, పార్టీ నాయకులు, సత్తిరాజు, సత్తిబాబు, గంటా పండు, పులవర్తి సంతోష్, కాలిబెన్ని, వీరమాచినేని నాగబాబు, మేడికొండ కృష్ణ, రాజేంద్ర,  కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top