అన్నా.. మా బిడ్డకు ‘మాట’ సాయం చేయండి

చిన్నారికి వైద్యం చేయించాలని   జగన్‌ తన సోదరుడికి సూచన

ప్రజాసంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘జగనన్నా... మా కుమారుడు సందీప్‌ వయస్సు ఆరేళ్లు. ఇప్పటికీ మాట్లాడడం రాదు. చాలామంది వైద్యులకు చూపించాం.  గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా ఆపరేషన్‌కు రూ.7 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. అంత ఖర్చు నేను భరించలేను. మా ఎమ్మెల్యేను రెండుసార్లు కలిసినా అయన స్పందించలేదు.  మీరైనా స్పందించి నా కుమారుడికి ‘మాట’ సాయం చేయండన్నా..’’ అంటూ కోవెలకుంట్ల మండలం రేవలూరుకు చెందిన ఓబులేష్, రాణమ్మ దంపతులు దొర్నిపాడు మండలం భాగ్యనగర్‌ వద్ద జగన్‌ను కలిసి తమ దీనస్థితిని వివరించారు. చలించిపోయిన జగన్‌.. తన సోదరుడు వైఎస్‌ కొండారెడ్డిని పిలిచి ఆ బాలుడికి వైద్యం చేయించే ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top