వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ డీఐజీ

YS Jagan 268th Day PrajaSankalpaYatra Started - Sakshi

సాక్షి, విశాఖపట్నం : మాజీ డీఐజీ ఏసురత్నం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డిని ఆయన ఆదివారం కలిశారు. ఈ సందర్బంగా ఏసురత్నంను వైఎస్‌ జగన్‌ సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు 1500మంది కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని గండిగుండం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు. 

అక్కడి నుంచి గండిగుండం కాలనీ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. తర్వాత జననేత పాదయాత్ర పెందుర్తి నియోజకర్గంలోకి ప్రవేశిస్తుంది. నియోజకవర్గంలోని అక్కిరెడ్డి పాలెం, జుట్టాడ క్రాస్‌ మీదుగా పాత్రులునగర్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి రాయవరపువాని పాలెం మీదుగా సారిపల్లి వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top