అనుమానాస్పదం కాదు.. హత్య కేసుగానే..

young man murder case Registered in Rajamahendravaram police  - Sakshi

రాజమహేంద్రవరం క్రైం: బాలాజీ పేట రైల్వే ట్రాక్‌పై ఈనెల 14వ తేదీ రాత్రి ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన కేసును హత్య కేసుగా నమోదు చేశారు. అర్బన్‌ జిల్లా ఎస్పీ డాక్టర్‌ షిమోషీ బాజ్‌పాయ్‌ ఆదేశాల మేరకు.. పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి అడిషనల్‌ ఎస్పీ అజితా వేజండ్ల ఆధ్వర్యంలో టూ టౌన్‌ సీఐ ముక్తేశ్వరరావు, నలుగురు ఎస్సైలతో ఒక టీమ్‌ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం, ఆల్‌కట్‌ తోటకు చెందిన రేగుళ్ల అరుణ్‌ కుమార్‌ (22) ఆగస్టు 14వ తేదీ రాత్రి బాలాజీ పేట రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇతడు ఆల్‌కట్‌ తోట ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించగా,  నాలుగు నెలల క్రితం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సమయంలో యువకుడిని చంపుతామని యువతి బంధువులు బెదిరించారని, వారే తమ కుమారుడిని చంపి ట్రాక్‌పై పడేశారని యువకుడి తల్లి, బంధువులు ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోస్టు మార్టం రిపోర్టులో యువకుడి మృతదేహంపై ఉన్న గాయాలు కొట్టడం వలన ఏర్పడినట్టుగా నిర్ధారణకు రావడంతో అర్బన్‌ జిల్లా ఎస్పీ హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య వెనుక ఎంత మంది ఉన్నారు అనేది పోలీస్‌ దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top