నాన్నా అంటూ వచ్చి.. నట్టేట ముంచి..

young lady cheated adivasi father named daughter

సెంటిమెంట్‌తో దెబ్బతీసిన యువతి    

మాయమాటలతో ఏటీఎం కార్డు దుర్వినియోగం

23 ఏళ్ల క్రితం బంధుత్వానికి వక్రభాష్యం

పోలవరం పరిహారం రూ.7.30 లక్షలు కాజేసిన వైనం

పోలీసులను ఆశ్రయించిన గిరిజనుడు

వేలేరుపాడు : 23 ఏళ్ల క్రితం విడిపోయిన బంధాలను పోలవరం ప్యాకేజీ పెనవేసింది. ఉన్న బంధాలను విడదీసింది. చివరకు మానవ సంబంధాలను అపహా స్యం చేసింది. ‘నాన్నా’ నేను నీ కన్న కూతురినే అన్న సెంటిమెంట్‌తో కొంపముంచింది. మాయమాటలతో బ్యాంక్‌ ఏటీఎం చేజిక్కించుకొని రూ.7.30 లక్షలు కా జేసింది. ఈ కిలాడీ మోసాన్ని తెలుసుకు న్న అమాయక ఆదివాసీ తండ్రి హృద యం తల్లడిల్లి పోలీసులను ఆశ్రయించా డు. వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం దురదపాడు గ్రామానికి చెందిన బాధితుడు కొర్సా రాజులుకు కుక్కునూరు మండలం దామరచర్ల గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. రాజులు మొదటి భార్య, కుమార్తెతో కలిసి దురదపాడులో ఉంటున్నారు. ఇదిలా ఉంటే రాజులకు రెండో భార్య వీరమ్మ, కుమార్తె అనిత ఉన్నారు. పేదరికంతో 23 ఏళ్ల క్రితం రా జులు నుంచి విడిపోయి వీరమ్మ మరో పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి వీరమ్మ, అనిత సంగతి మరిచిన రాజులు మొదటి భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.

బంధాలను పెనవేసిన ప్యాకేజీ
పోలవరం ప్రాజెక్ట్‌ ముంపులో కుక్కునూ రు మండలం దామరచర్ల గ్రామంలోని రాజులుకు చెందిన రెండెకరాల పొలం ఉంది. పరిహారంగా సుమారు రూ.50 లక్షల వరకు రాజులు ఖాతాలో జమకా నుంది. పరిహారం సొమ్ములు రావాలంటే నష్టపోతున్న ప్రాంతంలోనే నివాసముండాలనే నిబంధన ఉండటంతో దామరచర్లలో తన పొలం వద్దకు రాజులు మకాం మార్చాడు. పరిహారం సొమ్ము వస్తుందని తెలిసిన తర్వాత 23 ఏళ్ల క్రితం వెళ్లిపోయి న రెండో భార్య వీరమ్మ కుమార్తె అనిత రాజుల వద్దకు వచ్చి చేరింది. ‘నాన్నా.. నీవు జాగ్రత్త.. నీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ప్రేమ వలకబోసింది.

మాయమాటలతో మభ్యపెట్టి..
బ్యాంకు ఖాతా, ఏటీఎం వాడకం వంటివి తండ్రి రాజులుకు  నేర్పించింది. చాలా కాలం తర్వాత కూతురు రావడంతో రా జులు సంబరపడిపోయాడు. కుటుంబ అ వసరాలకు ఏటీఎం నుంచి అనిత సొమ్ములు డ్రా చేసి రాజులకు ఇస్తుండేది. అప్పుడప్పుడూ ఇద్దరు యువకులతో కలిసి వ చ్చి తండ్రిని పరామర్శించి వెళుతుండేది. రాజులకు మద్యం తాగే అలవాటు ఉండటంతో నమ్మకంగా ఏటీఎం కార్డును చే జిక్కించుకుంది. ఆ తర్వాత ఇద్దరి మద్యలో ఏటీఎం కార్డు అటూ ఇటూ తిరుగు తూ ఉంది. ఈ నేపథ్యంలో మూడు నెలలుగా రాజులకు నగదు అవసరం రాలే దు. తన ఖాతాలో పావు ఎకరం పరి హారంగా రూ.8.60 లక్షలు జమకాగా.. అవసరాల నిమిత్తం రూ.లక్ష వరకూ వా డుకున్నాడు. ఈ క్రమంలో ఖాతాల్లో సొ మ్ములు తక్కువగా ఉండటంతో బ్యాం కుకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. తనకు తెలియకుండా అనిత రూ. 7.30 లక్షలు డ్రా చేసినట్టు తెలిసి షాక్‌ తి న్నాడు. జూన్‌ 1 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు రూ.7.30 లక్షలు వివిధ ఏటీఎంలలో, షాపింగ్‌ నిమిత్తం డ్రా చేసినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్‌ ద్వారా తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.

సీసీ ఫుటేజీల ద్వారా ఆరా
బా«ధితుడు రాజులు అశ్వారావుపేట పోలీసులకు æఫిర్యాదు చేశాడు. ఏటీఎంలలో సీసీ ఫుటేజీ ఆధారంగా అనితతో పాటు రాజులు ఇంటికి వచ్చిన ఇద్దరు యువకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు యువకులు కుడుములపాడు గ్రామానికి చెందిన వారుగా గుర్తించి విచారించారు. తమకు చెందిన ఖాతాల లావాదేవీల నిమిత్తం ఏటీఎంలకు వెళ్లినట్టు వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అనిత వద్ద నుంచి ఏటీఎం కార్డు ఇంకెవరి వద్దకైనా వెళ్లిందా..? ఈ ఇద్దరు యువకుల పాత్ర ఏమైనా ఉందా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top