ట్రాఫిక్‌ వాహనంలో ‘వై’ అదృశ్యం !

Y Word Miss in YSR Kadapa on Traffic Police Van - Sakshi

కడప అర్బన్‌ : కడప ట్రాఫిక్‌ పోలీస్‌ వాహనంపై ‘వైఎస్‌ఆర్‌ కడప ట్రాఫిక్‌ వాహనం’ స్టిక్కరింగ్‌ ఉండగా, ‘వై’ అక్షరం కన్పించకుండా పోయింది. ప్రజా సంకల్పయాత్రను దిగ్విజయంగా ముగించుకుని  వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి  శుక్రవారం సాయంత్రం కడపకు చేరుకున్నారు.  ఆ సమయంలో ఆయన కాన్వాయ్‌కి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న కడప ట్రాఫిక్‌ పోలీసుల వాహనానికి వెనుకవైపున ‘వైఎస్‌ఆర్‌ కడప ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌’ అని ఉండాల్సింది, ‘వై’ అనే అక్షరం కనిపించకుండా పోయింది. ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా.. లేక ఓర్వలేనితనంతో చేసి ఉంటారా? అని ర్యాలీలో పాల్గొన్న అభిమానులు, ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top