సదుపాయాలు కరువు
శ్రీకాకుళం: ‘ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ క్వార్టర్స్‌లో కనీస సదుపాయాలు లేవు.’ అంటూ పోలీస్ సంక్షేమ సంఘం మహిళలు జగన్ వద్ద మొర పెట్టుకున్నారు. 350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ఇళ్లు మొత్తం శిథిలమవుతున్నాయని తెలిపారు. వర్షం పడితే కారిపోతున్నాయని, ఒత్తిడితో ఉద్యోగాలు చేయలేకపోతున్నామని చెప్పారు. కొత్త ఇళ్లు కట్టించాలని కోరారు.