మా కష్టాలు గట్టెక్కించే నాయకుడు
విశాఖపట్నం :పాదయాత్రలో భాగంగా జగన్ బాబు రాకతో గ్రామంలో అమ్మవారి గుడికే వెళ్లడం మరచిపోయాం. జగన్‌బాబు రాక మాకు పెద్ద పండగలా ఉంది. తాము ఎప్పటినుంచి జగన్‌బాబును కలుద్దామని ఎదురుచూశాం.అయితే మా గ్రామానికి రావడం మా ఆనందానికి అవధులు లేవు. జగనన్న మా అందర్నీ కలిశారు. ఇలా రాజన్న బిడ్డను కలవడం జీవితంలో మరిచిపోలేను. మా కష్టాలన్నీ గట్టెక్కించే నాయకుడు జగనన్నే అన్న నమ్మకం మాలో మరింత పెరిగింది.–బి.కర్రి లక్ష్మి, కె.గొట్టివాడ, కోటవురట్ల మండలం