కుమారుడు అడ్డుగా ఉన్నాడని..

కుమారుడు అడ్డుగా ఉన్నాడని..


- ప్రియురాలి సహకారంతో బాలుడిని హతమార్చిన ప్రియుడు

- గ్రామాస్తుల ఫిర్యాదుతో కేసు నమోదు

- పోలీసుల అదుపులో నిందితులు

వడమాలపేట :
తమ ఆనందానికి బిడ్డ అడ్డుగా ఉన్నాడని ఓ జంట నాలుగేళ్ల కుమారుడిని హతమార్చింది. వడమాలపేటలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా... తమిళనాడులోని మధురైకి చెందిన శివానందం మూడు నెలల క్రితం వడమాలపేటలోని సన్నిధి వీధిలో బాడుగ ఇంట్లో చేరాడు. అతనితోపాటు ప్రియురాలు వనిత, ఆమె కుమారుడు నదీష్ (4) వచ్చారు. వీరిద్దరూ తరచూ నదీష్‌ను కొడుతుండేవారు. చుట్టుపక్కల వారు ప్రశ్నిస్తే మాబిడ్డ మా ఇష్టం అనేవారు.



ఆదివారం నదీష్‌కు ఆరోగ్యం సరిగా లేదని ఆస్పత్రికంటూ ఆటోలో తిరుపతికి తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చిన శివానందం, వనితలను బిడ్డకు ఎలా ఉందని స్థాని కులు అడిగారు. బాగుందని, బంధువుల ఇంట్లో ఉంచామని చెప్పి ఇళ్లు ఖాళీ చేసి వడమాల చెరువుకట్ట వీధిలో వచ్చి చేరారు. బిడ్డ ను వీళ్లు ఏదో చేసి ఉంటారని భావిం చి కొందరు యువకులు చెరువుకట్ట వీధికి వెళ్లి శివానందాన్ని నిలదీశారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించారు. పోలీసులు విచారించగా బిడ్డను చంపేసిన ట్లు ఒప్పుకున్నారు.

 

పోలీసుల విచారణలో...

మధురైకు చెందిన వనితకు శివకార్తీక్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె గర్భిణిగా ఉండగా శివకార్తీక్ బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లా డు. అతను అక్కడే పెళ్లి చేసుకుని సెటి ల్ అయ్యాడు. వనిత నదీష్‌కు జన్మనిచ్చి మధురైలో ఉండగా రెండేళ్ల క్రితం శివానందంతో పరిచయమై కలి సి ఉండేవారు. తొలుత నదీష్‌ను మంచిగానే చూసుకున్న శివానందం ఆ తరువాత తరచూ కొట్టేవాడు. భార్య అడ్డుచెప్పకపోవడంతో వదిలిం చుకోవాలని నిర్ణయించుకున్నాడు.



ఆదివారం బీరు తాగించి నీటి తొట్టెలో ముంచి ఆ తరువాత అనారోగ్యంగా ఉందని తిరుపతికి తీసుకెళ్లారు. డాక్టర్లు చనిపోయారని చెప్పడంతో తమిళనాడుకు తీసుకెళ్లాలని నిర్ధారించుకుని కృష్ణగిరికి వెళ్లారు. బస్టాం డులో వనితను ఉంచి బిడ్డ శవాన్ని తీసుకొని బస్టాండు వెనుకకు వెళ్లాడు. కూలీలకు రూ.3 వేలు ఇచ్చి ఖననం చేయించినట్లు వనితకు చెప్పి వడమాలపేటకు తీసుకొచ్చాడు. రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్, ఏర్పేడు ఎస్‌ఐ ఈశ్వరయ్య మంగళవారం ఉదయం వడమాలపేటకు వచ్చి శివానందం ఇంట్లో సోదా చేశారు. స్థానికులను విచారించారు. కృష్ణగిరి పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు చేయగా   అక్కడ ఖననం చేసినట్లు నిర్ధారణ అయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top