మురిసిన పల్లెలు

Visakhapatnam People Grand Welcome To YS Jagan Praja Sankalpa Yatra - Sakshi

జననేత అడుగుతో పులకించిన జనం

జగన్‌పై పూల వర్షం

జనసంద్రమైన తుని–నర్సీపట్నం రహదారి

సాక్షి, విశాఖపట్నం: బహుదూరపు బాటసారి తొలి అడుగు ఉత్తరాంధ్రలో పడింది. ఉప్పొంగిన జన సంద్రం మధ్య జననేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద తొలి అడుగు వేసిన జనహృదయ నేతకు జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టడంతో తుని–నర్సీపట్నం రోడ్డు జనసంద్రాన్ని తలపించింది. జగన్నినాదంతో పల్లెదారులన్నీ హోరెత్తిపోయాయి. జననేత స్పర్శ కోసం పోటీపడ్డారు. అభాగ్యులు.. నిరుపేదలు..జననేత వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇక వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లాలో అడుగు పెట్టారు.

అడుగడుగునా ఆత్మీయత..
ఉదయం 8.45 గంటలకు కోటనందూరు మండలం కాకరాపల్లి నుంచి ప్రారంభమైన సంకల్ప యాత్ర వీబీ అగ్రహారం క్రాస్‌ రోడ్డు మీదుగా 9.20 గంటలకు గన్నవరం మెట్ట వద్ద విశాఖలో ప్రవేశించింది. నర్సీపట్నంతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది పార్టీ శ్రేణులు గ న్నవరం మెట్ట వద్ద తమ అభిమాననేతకు ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు..డప్పు వాయిద్యాలు..తీన్‌మార్‌ నృత్యాలు.. ఇలా వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని చాటుకున్నారు. రో డ్డుకిరువైపులా జగనన్నపై పూలవర్షం కురిపించా రు. ఇక బస్సులు, వాహనాల్లో ఉన్న వారు సైతం జననేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. చేలల్లో ఉన్న  కూలీలు సైతం అభిమాన నేతను చూసేందుకు పరుగున వచ్చారు.

తొలిరోజే జనపరవళ్లు
గన్నవరం మెట్ట మొదలుకుని రాత్రి బస చేసిన ఎ ర్రవరం వరకు వరకు జన ప్రవాహం వెల్లువెత్తింది. జననేత అడుగులో అడుగు వేసేందుకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, రైతు కూలీలు, భవ న నిర్మాణ కార్మికులు, విద్యార్థులు, యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కారు. జగన్‌ బాబు రావాలి.. సీఎం కావాలి.. ఆయన వస్తేనే మా పిల్లలకు బంగారు భవిష్యత్‌ ఉంటుంది. మా బతుకులు బాగుపడతాయ్‌ అంటూ జనం గొంతెత్తి చాటారు. జగన్‌ను చూస్తే వైఎస్‌ను చూసినట్టు ఉంది మాకోసం ఆ బాబు అంత కష్టపడుతున్నాడు..ఆయన కోసం ఈ కాసింత నడవ లేమా అంటూ వృద్ధులు, వికలాంగులు సైతం యాత్రలో మమేకమయ్యారు. కాస్త ఓపిక పట్టండి మనందరి ప్రభుత్వం వస్తుంది..మీ అందరికీ అండగా ఉంటానంటూ జగనన్న ఇచ్చిన భరోసా వారిలో కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.

మొక్క నాటిన జగన్‌
జగనన్న రాకతో ఆ గ్రామం పులకించింది. సంకల్పయాత్రకు గుర్తుగా మా నేలపై మొక్క నాటా లని డి.ఎర్రవరం ప్రజలు, స్థానిక నేత సబ్బవరపు వెంకునాయుడు కోరగా..జగన్‌మోహన్‌రెడ్డి స్పం దించి గ్రామ శివారులో మొక్క నాటి వారి ఆనందాన్ని రెట్టింపు చేశారు.  వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, శాసనసభ పక్ష ఉపనేత బూడి ముత్యాలనాయుడు, మాజీమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పేర్ల విజయ్‌చందర్, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనా«థ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంట్‌ సమన్వయకర్త ఎం.వి.వి.సత్యనారాయణ, అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శతృచర్ల పరీక్షిత్‌రాజు, నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, పార్టీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, ఐటీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి, సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర గణేష్, కరణం ధర్మశ్రీ,  శెట్టి ఫల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, రొంగలి జగన్నాథం, గొల్ల బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, అక్కరమాని విజయనిర్మల, వంశీకృష్ణ శ్రీనివాస్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, దామా సుబ్బారావు, అంకంరెడ్డి జమీల్, నగర మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరి, రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, జిల్లా నాయకులు సుధాకర్‌ సీతన్నరాజు, రవిరెడ్డి, పక్కి దివాకర్, తాడి జగన్నాథరెడ్డి, ప్రగడ నాగేశ్వరరావు, చంద్రమౌళి, కిరణ్‌రాజు, చొక్కాకుల వెంకటరావు, బోకం శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, శ్రీదేవి వర్మ, పీలా వెంకటలక్ష్మి, పీలా ఉమారాణి, తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, జర్సింగ్‌ సూర్యనారాయణ పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన పథకంకార్మికులకు భరోసా
తాము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు, కార్మికులకు న్యాయం చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. తాండవ సమీపంలో జిల్లాకు చెందిన మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు, కార్మికుల సంఘ జిల్లా నాయకులు ఆయనను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన నిర్వాహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు నిర్ణయించిందన్నారు. దీనివల్ల జిల్లాలో సుమారు 3 వేలమంది ఉపాధి కోల్పోతారని జిల్లా నాయకులు ప్రసన్న, శేషారత్నం వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కొద్దిదూరం వైఎస్‌ జగన్‌తో కలిసి పాదయాత్ర చేశారు. వారినుద్దేశించి జగన్‌ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామన్నారు. వారికి పని కల్పించడంతోపాటు, వేతనాలు కూడా పెంచుతామని హామీ ఇచ్చారు.

పోటెత్తిన గ్రామాలు
ఇక కాకరపల్లి నుంచి ప్రారంభమైన జననేత పాదయాత్ర వీబీ అగ్రహారం క్రాస్, వైబీ అగ్రహారం మీదుగా గన్నవరం మెట్ట వద్ద విశాఖలోకి అడుగు పెట్టింది. అక్కడ నుంచి మన్యపుఉరట్ల ,లింగంపేట, ఉప్పరగూడెం, బుచ్చంపేట, కేఆర్సీ పురం,రాజుపేట అగ్రహారం, ఏపీ పురం, నాయుడుపాలెం, శరభవరం గ్రామానికి పాదయాత్ర చేరగానే ఆ గ్రామస్తులతో పాటు సమీపంలోని నాయుడుపాలెం గ్రామస్తులు కూడా తరలివచ్చారు. శరభవరం వద్ద తమ ఆత్మీయ నేత అడుగులు నేలపై పడకుండా ఉండాలన్న సంకల్పంతో గ్రామం పొడవునా చీరలు పరిచి ఆ చీరలపై నడిపించారు. శరభవరం మీదుగా శృంగవరం చేరుకున్న జననేత అక్కడ భోజన విరామానికి ఆగారు.  తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరిన పాదయాత్ర చిరు జల్లుల మధ్యే కొనసాగింది. శృంగవరం నుంచి గాంధీనగర్‌ మీదుగా తాండవ జంక్షన్‌కు చేరుకోగానే అక్కడ నాతవరం, మర్రిపాలెం, వెన్నలపాలెం గ్రామస్తులు జననేతకు ఎదురేగి స్వాగతం పలికారు. గాంధీనగర్‌ వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తాండవ జంక్షన్‌ మీదుగా డి.ఎర్రవరం పాదయాత్ర సాగింది. ఎర్రవరం గ్రామం దాటిన తర్వాత పొలాల్లో సాయంత్రం ఐదు గంటలకు రాత్రి బస ప్రాంతానికిచేరుకోవడంతో తొలిరోజు పాదయాత్ర ముగిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top