అంతా విజయ సారధ్యం

Vijayasai Reddy Plan Workout In Praja Sankalpa Yatra - Sakshi

ఫలించిన విజయసాయిరెడ్డి శ్రమ, పట్టుదల

ముందస్తు ప్రణాళిక.. అందరి సమన్వయం..

కొత్త చరిత్ర సృష్టించిన విశాఖ సభ

అంచనాలు మించి జనం రావడంతో హర్షాతిరేకాలు

పెదవాల్తేరు(విశాఖతూర్పు): రాజ్యసభసభ్యుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  విజయసాయిరెడ్డి సారధ్యం విజయవంతమయింది. విశాఖలో జగన్‌ బహిరంగ సభ కనీవినీ ఎరుగని రీతిలో జనం తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం ఉప్పొంగింది. విజయసాయిరెడ్డి చేసిన దశా,దిశా నిర్దేశం వల్లనే నగరంలోని కంచరపాలెం మెట్టు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభ విజయవంతమయిందని చెప్పాలి. పార్టీశ్రేణులను సమన్వయపరుస్తూ ఎవరెవరు ఏయే బాధ్యతలు తీసుకోవాలో సూచించారు. జిల్లాలోని నియోజకవర్గాలలో పాదయాత్ర, బహిరంగ సభలు విజయవంతం అయిన నేపథ్యంలో విశాఖ నగరంలో జరిగే సభను విజయసాయిరెడ్డి అత్యంత  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఆయన ఒకవైపు ఢిల్లీ, హైదరాబాద్‌ పర్యటనలు చేస్తూనే వారం రోజులుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతూ, అంతా తానై విశాఖ సభ దిగ్విజయం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఒకవైపు జగన్‌ పాదయాత్రలో పాల్గొంటూనే సాయంత్రం ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యేవారు. ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో విశాఖలో జగన్‌ సభ చరిత్రలో నిలిచేలా చేశారు. ఇంటిలెజెన్సీ వర్గాలకు కూడా ఊహకందని విధంగా జనం తరలిరావడంతో వైఎస్సార్‌ సీపీ నేతల్లో ఫుల్‌ జోష్‌ నింపింది. దీని వెనుక విజయసాయిరెడ్డి పాత్ర కీలకమనే చెప్పాలి. జిల్లాలోని సభలన్నీ ఒక ఎత్తు అయితే, నగరంలోని కంచరపాలెంలో జరిగిన సభ ఒక ఎత్తు అనే చెప్పాలి. విశాఖ జిల్లాలో  పాదయాత్ర  నిర్వహిస్తున్న బహిరంగ సభలకు ప్రజలనుంచి విశేష స్పందన వస్తున్న తరుణంలో కంచరపాలెం సభకు అంచనాలకు మంచి జనాలు రావడంతో అధికార పార్టీ నేతల్లో అలజడి మొదలైందనే చెప్పాలి.  కంచరపాలెం మెట్టు రోడ్లు, ఫ్లై ఓవర్‌బ్రిడ్జి, డాబాలు, దుకాణాలు, ఫుట్‌పాత్‌లు ఇలా ఎక్కడ అవకాశం వుంటే అక్కడ జనాలు కిక్కిరిసిపోయారు. జననేత జగన్‌ ప్రసంగం ఉత్సాహంగా వింటూ జనం జేజేలు పలికారు.

మరిన్ని వార్తలు

18-11-2018
Nov 18, 2018, 19:26 IST
సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300వ రోజు...
18-11-2018
Nov 18, 2018, 13:47 IST
చలి వణికించినా.. ఎండలు మండినా.. జడివానలు జడిపించినా.. వజ్రసంకల్పంతో ముందడుగు వేస్తున్నారు వైఎస్‌ జగన్‌. ప్రతి గుండెలో తాను కొలువై...
18-11-2018
Nov 18, 2018, 12:08 IST
సాక్షి, వైఎస్సార్‌: రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన...
18-11-2018
Nov 18, 2018, 09:24 IST
సాక్షి, పార్వతీపురం: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నానని భరోసానిస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
18-11-2018
Nov 18, 2018, 06:50 IST
గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలని పాలకులు ప్రకటనలు గుప్పిస్తున్నారే తప్ప ఆచరణలో అభివృద్ధి చేయడం లేదు. చాలా గ్రామాల్లో కనీసం మౌలిక...
18-11-2018
Nov 18, 2018, 06:45 IST
గిరిజన యువత పీజీ, డిగ్రీ, డైట్, బీఎస్సీ, నర్శింగ్, తదితర కోర్సులు చేసి నిరుద్యోగులుగా ఉన్నారు. బాబు వస్తే జాబు...
18-11-2018
Nov 18, 2018, 06:42 IST
నాకు పక్షవాతం వచ్చి ఎడమ చేయి, ఎడమ కాలు చచ్చుబడిపోయాయి.  పని కూడా చేసుకోలేకపోతున్నాం. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా...
18-11-2018
Nov 18, 2018, 06:39 IST
ఎస్టీలకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలామంది దరఖాస్తు చేసుకున్నాం. నాకు 50 సంవత్సరాలు....
18-11-2018
Nov 18, 2018, 06:35 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పార్వతీపురం జనంతో పోటెత్తింది. ఇసుక వేస్తే రాలనంత జనాభిమానం తరలివచ్చింది. ప్ర త్యర్థుల ఊహలను తలకిందులు...
18-11-2018
Nov 18, 2018, 04:35 IST
నాపై హత్యాయత్నం కేసులో అయితేనేమి , రాష్ట్రంలో జరిగిన అవినీతి వెనుక అయితేనేమి, దుర్మార్గాల వెనుక అయితేనేమి, చివరికి అడ్డగోలుగా...
18-11-2018
Nov 18, 2018, 04:12 IST
17–11–2018, శనివారం   పార్వతీపురం పాతబస్టాండ్‌ సెంటర్, విజయనగరం జిల్లా ఏ స్వతంత్ర సంస్థతోనైనా దర్యాప్తునకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?  ‘ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’...
17-11-2018
Nov 17, 2018, 19:53 IST
సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300వ...
17-11-2018
Nov 17, 2018, 18:46 IST
సాక్షి, విజయనగరం : ‘రాజకీయంగా నన్ను ఎదుర్కొనే దమ్ములేకనే.. అంతమెందించాలని చూశారు’ అని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు...
17-11-2018
Nov 17, 2018, 17:37 IST
చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అవుతున్నా రాజధానిలో ఒక్క శాశ్వత కట్టడం కూడా కట్టలేదని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.
17-11-2018
Nov 17, 2018, 12:54 IST
సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరంలో దిగ్విజయంగా సాగుతోంది. ప్రజలు వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం...
17-11-2018
Nov 17, 2018, 07:34 IST
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ నెలాఖరులోగా జిల్లాలో ప్రవేశించే...
17-11-2018
Nov 17, 2018, 06:55 IST
విజయనగరం, జియ్యమ్మవలస: వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రను జయప్రదం చేయాలని కురుపాం ఎమ్మెల్యే...
17-11-2018
Nov 17, 2018, 06:49 IST
వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం ..
17-11-2018
Nov 17, 2018, 06:31 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆయన వస్తున్నారంటేనే ఓ సంచలనం. అడుగేస్తున్నారంటే ప్రభంజనం. ఆయన ప్రసంగిస్తున్నారంటే... పాలకపక్షనేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి....
16-11-2018
Nov 16, 2018, 21:41 IST
సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 299వ...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top