'చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయి'

'చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయి'


సాక్షి, విజయవాడ : నదుల అనుసంధానం గురించి మాట్లాడే నైతికత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. కృష్ణానదిపై అక్రమ నిర్మాణాల్లో పాలుపంచుకుంటున్న చంద్రబాబు నదులను పరిరక్షిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే ఆల్మట్టి ఎత్తు పెంచారని మండిపడ్డారు. ఫలితంగా నేడు రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, హంద్రీనీవా, గాలేరి నగరి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. చాలా ప్రాజెక్టుల్లో 85శాతం పనులు వైఎస్‌ హయాంలోనే పూర్తయ్యాయని, మిగితా పనులను చంద్రబాబు ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top