వాసిరెడ్డి పద్మ ప్రమాణ స‍్వీకారం

Vasireddy Padma Takes Charge As AP Women Commission Chairperson - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత... వాసిరెడ్డి పద్మతో మహిళ కమిషన్ చైర్ పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, నారాయణ స్వామి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, జయరాములు, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ్‌ రాజు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, ఎంపీలు వంగా గీత, చింత అనురాధ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారుడు జీవీడీ కృష్ణమోహన్‌ తదితరులు హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన వాసిరెడ్డి పద్మకు అభినందనలు తెలిపారు. కాగా  ఈ నెల 8న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top