ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: బుట్టా రేణుక


ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్‌ చేశారు. సోమవారం లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌ రైతులకు కూడా రుణ మాఫీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులు,  చేనేత కార్మికులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top