ఉద్యోగాలు భర్తీచేయాలి..

Unemployeed Youth Meet YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం :వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇప్పటికే వందలాది మంది అగ్రికల్చర్‌ విభాగంలో డిప్లమా పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేసి ఆదుకోవాలి.– ముంతల సౌజన్య, శ్రీకాకుళం

పూసల కులాన్ని ఆదుకోవాలి
ప్లాస్టిక్‌ బొమ్మలను అమ్ముకొని జీవిస్తున్న పూసల కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది ఉన్నారు. కృష్ణబలిజ, పూసల కులాలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినా రుణాలు మాత్రం అందడం లేదు. మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా కులాన్ని ఆదుకోవాలి.– పసుపులేటి మనోజ్‌కుమార్, పూసల కుల సంఘం రాష్ట్ర, యువజన కార్యనిర్వాహక అధ్యక్షుడు, వేంపల్లి, కడప జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top