మీరైనా జోక్యం చేసుకోండి

మీరైనా జోక్యం చేసుకోండి


గ్రూప్‌ 2 పరీక్షలను వాయిదా వేయించండి

ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌కు నిరుద్యోగుల వినతిసాక్షి, హైదరాబాద్‌: తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా సీఎం చంద్రబాబుతో పాటు ఏపీపీఎస్సీ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని.. కనీసం మీరైనా జోక్యం చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గ్రూప్‌–2 పరీక్షలు వాయిదా వేయించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు నిరుద్యోగులు విజ్ఞప్తి చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవు తున్న అభ్యర్థులతో పాటు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు గురువారం జగన్‌ను ఆయన నివాసంలో కలిశారు. తమ సమస్యలపై వారు జగన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీపీఎస్సీ సుదీర్ఘకాలం తర్వాత గ్రూప్‌ 1, 2తో పాటు పంచాయితీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. అయితే ఒక పరీక్షకు, మరో పరీక్షకు మధ్య వ్యవధి చాలా తక్కువగా ఉండటంతో ప్రిపరేషన్‌కు తగిన వ్యవధి లేక అభ్యర్థులంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు వివరించారు. ఇందుకు వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. తప్పకుండా తన వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.

Back to Top