'ఉన్నత స్థాయి చదువుతోనే అభివృద్ధి సాధ్యం'

Undavalli Sridevi Comments In Intellectual Forum Programme In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ లో 'ఇంటలెక్చువల్‌ ఫోరమ్ ఫర్ మాదిగాస్' సంస్థ ఆధ్వర్యంలో ద్వితీయ ప్రపంచ మాదిగ దినోత్సవం ప్లీనరీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రాజ్యసభ ఎంపీ హనుమంతుప్ప, ఎంపీ నందిగాం సురేష్,తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. చిన్నఉద్యోగంతో సరిపెట్టుకోకుండా  ఉన్నతస్థాయి చదువుతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.ఒక కుటుంబంలో మహిళలు చదువుకుంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మన జాతిలో ఉన్న కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చి వారికి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రత్యేక ఎస్సీ కార్పొరేషన్‌ను ఎర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని శ్రీదేవి పేర్కొన్నారు.

ఇప్పటి వరకు అనేక రాజకీయపార్టీలు మాదిగలకు అండగా ఉంటామని చెప్పారు కానీ మాదిగలకు వైఎస్‌ జగన్‌ మాత్రమే న్యాయం చేస్తున్నారని ఎంపీ నందిగాం సురేశ్‌ వెల్లడించారు. స్వార్ధ ప్రయోజనాలను పక్కనపెట్టి జాతి కోసం పని చేయాలని చెప్పే వారు మాత్రమే లోకంలో గొప్పవారు అవుతున్నారని పేర్కొన్నారు. తనకు సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రయోజనాలు కోసం కష్టపడి పని చేస్తానని, అందుకే తనను 5.50 లక్షల మంది ఓట్లు వేసి గెలిపించారని నందిగాం సురేశ్‌ పేర్కొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top