ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా..

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా..


శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన ఉమ్మారెడ్డిసాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై అలుపెరగని పోరా టం చేస్తానని, వైఎస్సార్‌సీపీ అధినే త వైఎస్‌ జగన్‌ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేరు స్తానని శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎంపికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వివిధ చట్ట సభల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంట్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశానన్నారు.శుక్రవారం శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ సమక్షంలో ఉమ్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించిన జగన్‌కు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన గుంటూరు జిల్లా వైఎస్సార్‌ సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జులకు ఉమ్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top