సర్కార్ షాక్


 సిద్దిపేటటౌన్, న్యూస్‌లైన్: ఎండకాలం ఇంకా ప్రవేశించనేలేదు. అప్పుడే కరెంట్ కోతలు రెట్టింపయ్యాయి. రైతులకు కీలకమైన సమయంలో ఈ విద్యుత్ కోతలు శాపంగా మారనున్నాయి. ఇక సామాన్య ప్రజలు అటు ఎండలనూ, ఇటు విద్యుత్ కోతలనూ ఎదుర్కోవడానికి సిద్ధంకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ట్రాన్స్‌కో విద్యుత్ కోతల షెడ్యూల్‌ను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి కోతలు ఆమలుకానున్నాయి.



సాధారణ పరిస్థితుల్లో ఈ కోతలు ఉంటాయి. సాంకేతిక లోపాలు తలెత్తితే కోతలు మరింత పెరిగే ప్రమాదం కూడా పొంచి ఉంది. శనివారం నుంచి జిల్లా హెడ్‌క్వార్టర్ సంగారెడ్డిలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, మున్సిపాలిటీలు, పట్టణాల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇక మండల కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు విద్యుత్ కోతలు ఉంటాయి. ఇక పల్లెల్లో అప్పుడప్పుడు మాత్రమే విద్యుత్ కనిపించే అవకాశముంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top