నేటి ముఖ్యవార్తలు..


జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం హైదరాబాద్‌లో తొలిసారి జరగనుంది. ప్రభుత్వ పథకాలపై పన్ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపై 5 శాతమో పన్ను ఉండాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అంతేకాకుండా చాలా రాష్ట్రాలు మనకు మద్దతిస్తున్నాయని ఆయన చెప్పారు. 

 

రైతు సమన్వయ సమితులు

నేటితో రైతు సమన్వయ సమితుల ఏర్పాట్లు ముగియనున్నవి. ఇప్పటి వరకు 8,640 గ్రామ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. మండల సమితుల శిక్షణకు సీఎం కేసీఆర్‌ కొన్ని చోట్లకు వెళ్లే అవకాశం ఉంది.

 

ఏపీ కేబినెట్‌ సమావేశం

నేడు అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం జరగనుంది. 

 

ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

నేడు విజయవాడలో ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనడానికి 17 నుంచి 21 ఏళ్ల యువతకు అవకాశం ఉంటుంది. 

 

తిరుమల

నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చేవారికి 3 గంటల సమయం పడుతోంది. 

 

ప్రోకబడ్డీ 

నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యు ముంబా, హర్యానాతో బెంగళురు తలపడతాయి.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top