ఈనాటి ముఖ్యాంశాలు

Today news updates 20th July Sheila Dikshit Passes Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గల్ఫ్‌ జలాల్లో మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఇరాన్‌ ప్రయత్నించింది. హొర్ముజ్‌ స్ట్రెయిట్‌ జలాల్లో వెళ్తున్న బ్రిటిష్‌ జెండాతో ఉన్న ఓ చమురు ట్యాంకర్‌ను ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ సిబ్బంది తమ అధీనంలోకి తీసుకుంది. ఈ ట్యాంకర్‌లో 23 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 18 మంది భారత్‌కు చెందినవారుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యవహార శైలిని బాపట్ల వైఎస్సార్‌ సీపీ ఎంపీ నందిగం సురేశ్‌ తప్పుబట్టారు. మాదిగల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఆగస్టు తర్వాత అసలైన పరిపాలన ఉంటుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ఇన్నాళ్లు చేసింది నకిలీ పరిపాలనా అనుకోవాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top