నేటి ప్రధాన వార్తలు

Today News Rounup 17th July  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశంలో బీజేపీ తీరును వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిలదీశారు. ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను అఖిలపక్షానికి ఆహ్వానించడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బుట్టా రేణుకను ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

బుట్టాకు ఆహ్వానం.. విజయసాయి ఫైర్‌
సాక్షి, హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశంలో బీజేపీ తీరును వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిలదీశారు. 

పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు 
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం నేత, మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

శ్రీవారి ఆలయ మూసివేతపై మారిన ఈవో స్వరం!
సాక్షి, తిరుమల : మహా సంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని సుమారు తొమ్మిది రోజులపాటు మూసివేస్తామని ప్రకటించి.. సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న టీటీడీ బోర్డు తాజాగా స్వరాన్ని మార్చింది. 

నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో శాంతి, భద్రతలు కరువయ్యాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు.

పరిపూర్ణానంద బహిష్కరణ.. ‘ఛలో ప్రగతిభవన్‌’కు పిలుపు!
సాక్షి, హైదరాబాద్‌ : శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కణ చేయడంపై బీజేపీ ఆందోళన తీవ్రతరం చేసింది.

మోదీ అంటే లవ్వే లేదా?
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ దేశాల అధినేతలతో కారాలు మిరియాలు నూరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తన వైఖరి మార్చుకోవటం చర్చనీయాంశంగా మారుతోంది. 

రాహుల్‌పై వ్యాఖ్యలు.. మాయావతి కఠిన నిర్ణయం..
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఉద్దేశించి బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) ఉపాధ్యక్షుడు జై ప్రకాశ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షురాలు మాయావతి మంగళవారం తీవ్రంగా స్పందించారు.

జంబలకడిపంబ: భర్తకు భార్య వేధింపులు!
సాక్షి, బెంగళూరు: భార్య బాధితులు కూడా గృహహింస నిరోధక చట్టం ద్వారా కేసు దాఖలు చేయవచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

బిడ్డకు పాలివ్వటమే శాపమైంది
పెన్సిల్వేనియా రాష్ట్రంలో విచిత్రమైన కేసు నమోదు అయ్యింది.

రూ.499కే అమెజాన్‌ ప్రైమ్‌
న్యూఢిల్లీ : అమెజాన్‌ ప్రైమ్‌ యువతకు బంపరాఫర్‌ ప్రకటించింది.

అందుకే గౌరీని పెళ్లాడాను : హీరో
బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు అభిమానులతో సరదాగా ముచ్చటించడమంటే మహా సరదా.

బిగ్‌బాస్‌ : వెక్కి వెక్కి ఏడ్చిన గణేశ్‌
సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సీజన్‌-2 ఏమైనా జరుగొచ్చు అన్న ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టే సోమవారం ఎపిసోడ్‌ కొంత ఆసక్తికరంగా.. మరికొంత నిరుత్సాహంగా సాగింది.

‘నా చెత్త ప్రదర్శనను ధోని గుర్తు చేశాడు’
లండన్‌: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఎంఎస్‌ ధోని ఆడిన ఇన్నింగ్స్‌ తన గత చెత్త ప్రదర్శనను గుర్తుకు తెచ్చిందని భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌  గావస్కర్‌ పేర్కొన్నాడు.

‘పది’పై టీమిండియా గురి
లీడ్స్‌: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ గెలిచిన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top