టుడే న్యూస్‌ రౌండప్‌

today news roundup

సాక్షి, ధర్మవరం : ముడిపట్టు రాయితీ బకాయిల కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపేందుకుగానూ అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీక్షా ప్రాంగాణానికి వెళ్లే దారులన్నీ లక్షల సంఖ్యలోని జనంతో కిక్కిరిపోయాయి. జనసందోహానికి అభివందనం చేస్తూ వైఎస్‌ జగన్‌ ర్యాలీగా దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. 37 రోజులుగా దీక్షలో కూర్చున్న మహిళా చేనేత కార్మికులతో ఆయన మాట్లాడారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

------------------------------------------- రాష్ట్రీయం --------------------------------------------

ధర్మవరంలో జననేతకు అపూర్వస్వాగతం
దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపేందుకుగానూ అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

'డబ్బు మూటలే కావాలా.. పిల్లలు చనిపోతుంటే పట్టదా'
విద్యార్థుల మరణాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టడం లేదని, కమిటీలు వేసి చేతులు దులుపుకోవడం చంద్రబాబుకు అలవాటైందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. 

ఏ1 రవిబాబు అరెస్ట్‌పై అనుమానాల నీడలు
గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆర్టీసీ విజిలెన్స్‌ డీఎస్పీ దాసరి రవిబాబు అరెస్ట్‌ జాప్యంపై పలు అనుమానాలు ముసురుకుంటున్నాయి.

మంత్రి పదవి చేపడతా
రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రి పదవి చేపడుతానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 

నిరుపేదల ఆత్మగౌరవం డబుల్‌
దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తోందని ఎమ్మె ల్యే  శ్రీనివాస్‌గౌడ్‌ అన్నా రు. 

------------------------------------------- జాతీయం --------------------------------------------

తాజ్‌ మహల్‌పై ప్రధాని తొలిసారి ప్రకటన
 తాజ్‌ మహల్‌పై పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీని విమర్శలపాలు చేస్తుండటంతో వాటికి పుల్‌ స్టాప్‌ పెట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ రంగంలోకి దిగారు.

రాముడికి ముస్లింల బహుమతి
సరయూ నదితీరంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిర్మించ తలపెట్టిన 100 మీటర్ల రాముడి విగ్రహానికి ముస్లింలు మద్దతిచ్చారు.

------------------------------------------- అంతర్జాతీయం --------------------------------------------

కారుబాంబు.. పొలాల్లో ముక్కలై పడిన జర్నలిస్టు
పనామా కేసులో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుగా పనిచేస్తున్న డాదప్నే కార్వానా గలిజియా(53) అనే జర్నలిస్టును చంపేశారు. 

ఎప్పుడైనా అణుయుద్ధం.. అమెరికా మారకుంటే : కిమ్‌
అమెరికా తన కవ్వింపు చర్యలు ఆపేసే వరకు తాము తమ అణ్వాయుధాలపై చర్చలకు అంగీకరించబోమని ఉత్తర కొరియా స్పష్టం చేసింది.

ప్లీజ్‌ హిల్లరీ.. నాతో మరోసారి తలపడవా : ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ డెమొక్రటిక్‌ పార్టీ నేత, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు వ్యంగ్యంగా సవాల్‌ విసిరారు.

------------------------------------------- బిజినెస్‌ --------------------------------------------

ఏటీఎంలలోకి కొత్త రూ.200 నోట్లు ఎప్పుడంటే..
చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టేందుకు వచ్చిన రూ.200 నోటు ఏటీఎంలలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలు వేచిచూస్తున్న సంగతి తెలిసిందే. 

జస్ట్‌ రూ.500కే ​క్రెడిట్‌ కార్డు వివరాలు
సైబర్‌ కేటుగాళ్లు ఆగడాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను మధ్య ప్రదేశ్‌ పోలీసు సైబర్‌ స్క్వాడ్‌ అరెస్టు చేసింది.

------------------------------------------- సినిమా --------------------------------------------

ఎన్టీఆర్ ఆత్మ రోజు నా కలలోకి వస్తోంది : వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

పనికి మాలినోళ్లతో బిగ్‌ బాస్‌
బాలీవుడ్ నటుడు అర్షద్‌ వార్సి బిగ్ బాస్‌ షోపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా నడుస్తున్న ప్రస్తుత సీజన్‌ చాలా చాలా పేలవంగా ఉందని వార్సి చెబుతున్నాడు.

మెగా రికార్డును బద్దలు కొడతాడా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జై లవ కుశ. తారక్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 

------------------------------------------- క్రీడలు --------------------------------------------

అనిల్‌ కుంబ్లేకు సెహ్వాగ్‌ 'బర్త్‌డే' గిఫ్ట్‌ ఇదే..!
'దంతెరస్‌' రోజు భారత్‌కు అతిపెద్ద 'ధన'మైన అనిల్‌ కుంబ్లే భాయ్‌కి పుట్టినరోజు శుభకాంక్షలు.. జైజై శివశంభో.. హ్యాపీ బర్త్‌డే జంబో'.. 

కోహ్లి రికార్డును మళ్లీ బద్ధలు కొట్టిన ఆమ్లా
టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దూకుడు చూస్తుంటే మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ రికార్డును అందుకునేందుకు ఎంతో కాలం పట్టేలా కనిపించటం లేదు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top