టుడే న్యూస్‌ రౌండప్‌

Today News Roundup 25th July - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ర్టంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి నియోజకవర్గంలో ఆరు హత్యలు చోటుచేసుకోవడం టీడీపీ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. మిగతా పార్టీలకు అనుకూలంగా ఉన్నారన్న కారణంతో పేదలకు రావాల్సిన పింఛన్లు  సైతం  ఫోన్లు చేసి అడ్డుకుంటారని హోం మంత్రి చినరాజప్పపై వైఎస్‌ జగన్‌ పరోక్షంగా ఆరోపణలు చేశారు.
 

ఫోన్లు చేసి మరీ పింఛన్లు ఆపేస్తున్నారు: వైఎస్‌ జగన్‌
సాక్షి, పెద్దాపురం: రాష్ర్టంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి నియోజకవర్గంలో ఆరు హత్యలు చోటుచేసుకోవడం టీడీపీ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 

ఆసుపత్రికి ఆ స్థలం అనువుగా లేదు
ఢిల్లీ : విశాఖపట్నం జిల్లా షీలానగర్‌లో 500 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 8.59 ఎకరాల భూమి అనువుగా లేదని కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ బుధవారం రాజ్య సభలో వెల్లడించారు.

దుర్గారావుది మరణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్య
సాక్షి, కర్నూలు : చంద్రబాబు మోసానికి, ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్‌ విజయవంతం చేసిన..

‘టీఆర్‌ఎస్‌ నుంచి హరీష్‌ ఔట్‌’ 
సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌లో వర్గ పోరాటం జరుగుతోందని, హరీష్‌రావును సీఎం కేసీఆర్‌ త్వరలోనే పార్టీ నుంచి గెంటివేస్తారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి జోస్యం చెప్పారు.

ముజ్రాపార్టీ.. పోలీసులకు షాక్‌!
సాక్షి, విజయవాడ : ఇటీవల విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌లో ముజ్రా పార్టీ పేరిట మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

కోర్టులో భర్త చేసిన పనికి భార్య షాక్‌..
చండీగఢ్‌ : విడాకులు తీసుకున్న భార్యను ఇబ్బంది పెట్టడానికి కొత్తపద్దతి ఎంచుకున్నాడో లాయర్‌ భర్త. 

రాఫెల్‌ డీల్ ‌: రాహుల్‌ తాజా ఆరోపణలు
సాక్షి,న్యూఢిల్లీ:  రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై కాంగ్రెస్‌  అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలకు దిగారు.

భారత్‌కు మున్ముందు ముప్పే!
సాక్షి, న్యూఢిల్లీ : క్రికెట్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడం తన దృష్టిలో మోసం కాదని, అది ఆటలో భాగమేనని మాజీ పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజం, ప్రస్తుతం పాక్‌ ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌ అభిప్రాయం.

కొత్త డిజైర్‌, స్విప్ట్‌ కార్ల రీకాల్‌
సాక్షి, న్యూఢిల్లీ: ఆటోదిగ్గజం మారుతి సుజుకి దేశంలో భారీ ఎత్తున కార్లను రీకాల్‌ చేస్తోంది.

పెళ్లి పీటలెక్కనున్న స్టార్‌ హీరోయిన్‌..?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా త‍్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారట.

నా కెప్టెన్‌కి సలహాలు అక్కర్లేదు : సచిన్‌
ముంబై :  టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌​ టెండూల్కర్‌ మద్దతుగా నిలిచారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top