నేటి ముఖ్యాంశాలు

Today News Roundup 21st July - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అనుసరించిన వైఖరి పట్ల  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల బలీయమైన ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను, రాష్ట్ర సమస్యలను పట్టించుకోకుండా అవిశ్వాసంపై చర్చలో తమ ఎజెండాను మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రస్తావించాయని ఆయన తప్పుబట్టారు. అవిశ్వాసం చర్చలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరును దుయ్యబట్టారు. 

రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన వైఎస్‌ జగన్‌
సాక్షి, కాకినాడ : లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అనుసరించిన వైఖరి పట్ల  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబుకి పవన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌
సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

‘టీడీపీలో తిరుగుబాటు’
సాక్షి, తిరుపతి: లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాసం విగిపోవడం ద్వారా టీడీపీకి గట్టి దెబ్బ తగిలిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు.

నిజమైన దోషులెవరో తేలిపోయింది : పురందేశ్వరి
సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన దోషులెవరో తేలిపోయిందని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు.

‘వారి చేతులు రక్తపు మరకలతో తడిశాయి’
కోల్‌కత్తా : బీజేపీ ప్రభుత్వం తాలిబన్‌ గ్రూపులను తయారుచేసి దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా  బెనర్జీ ఆరోపించారు.

అసభ్యంగా తాకాడు.. ఆపై...!
జార్జియా: లైంగిక వేధింపులను మౌనంగా భరించే వాళ్లు కొందరైతే.. ఎదురించేవాళ్లు మరికొందరు. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని గల్ల పట్టి పోలీసులకు అప్పగించారు ఓ మహిళ.

స్మార్ట్‌ సిటీగా ‘బిగ్‌ ఆపిల్‌’
బార్సిలోనా : ప్రపంచంలోనే అత్యంత ఆకర్షయణీయ నగరం(స్మార్ట్‌ సిటీ)గా న్యూయార్క్‌ నిలిచింది. 

కొత్త 100 నోటు : 100 కోట్ల ఖర్చు
న్యూఢిల్లీ : లేత వంగ పువ్వు వర్ణంలో కొత్త వంద రూపాయి నోటు త్వరలోనే చలామణిలోకి రాబోతుంది.

74 శాతం ఏటీఎంల పరిస్థితి అంతే..!
న్యూఢిల్లీ : ఏటీఎంలలో ఈ మధ్య పెద్ద ఎత్తున్న మోసాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

‘పరిచయం’ మూవీ రివ్యూ
వెండితెర మీద ప్రేమకథలు ఎవర్‌గ్రీన్‌. ఏ జానర్‌ సినిమాలు సక్సెస్‌ అయినా కాకపోయినా.. 

తొలి రోజే ‘ధడక్‌’ సరికొత్త రికార్డు
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ కరణ్‌ జోహార్‌ నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘ధడక్’.

61 ఏళ్ల తర్వాత రెండో బౌలర్‌గా..
కొలంబో : దక్షిణాఫ్రికా ఎడంచేతి వాటం స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

వారి సరసన కోహ్లి చేరేనా?
హైదరాబాద్‌: విరాట్‌ కోహ్లి సారథ్య బాధ్యతలు చేపట్టిన నుంచి టీమిండియా అప్రతిహత విజయాలతో దూసుకపోతున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top