నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 19th July 2018 - Sakshi

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని, ప్రకృతిలో ఆయన ఎటూకాని వ్యక్తి అని విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ నేతలకు ఎంపీ కవిత ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశంసించారు.

తెలంగాణ ప్రభుత్వంపై సుబ్రమణ్యస్వామి ఫైర్‌
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఫైర్ అయ్యారు.

రాబంధుల్లాగా దోచుకుంటున్నారు
హైదరాబాద్‌ : నెరేళ్ల సంఘటన జరిగిన ఏడాది కావస్తున్న సందర్భంలో బాధితులతో కలిసి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

జేసీతో విభేదాలు.. సీఎంను కలిసిన ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి : అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బట్టబయలు కాగా, వివాదం మరింత ముదరకుండా చూసేందుకు పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

మహిళల పట్ల రాహుల్‌కూ చిన్న చూపే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను ఈసారి రాష్ట్ర అసెంబ్లీలో, అలాగే క్యాబినెట్‌లో ఎక్కువ మంది మహిళలను చూడదల్చుకున్నాను’ అని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గత ఫిబ్రవరి 24వ తేదీన బెంగళూరులోని బీఎల్డీ స్కూల్‌ గ్రౌండ్స్‌లో జరిగిన మహిళా శక్తి సమ్మేళనంలో వ్యాఖ్యానించారు.

శబరిమల ఆలయంలో మహిళల నిరోధం అందుకే..
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల ఆలయంలోకి పురుషుల తరహాలో మహిళలూ వెళ్లి పూజలు చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ట్రావన్‌కోర్‌ దేవస్ధానం బోర్డు గురువారం స్పందించింది.

ఎన్నారై యువకుడి దారుణహత్య
టొరంటో : భారత సంతతికి చెందిన 27 ఏళ్ల యువకుడు దారుణహత్యకు గురయ్యాడు.

‘మమ్మల్ని చంపితే మీకేం వస్తుంది..?’
తిరువనంతపురం :  ‘మమ్మల్ని చంపితే మీకేం వస్తుందం’టూ ఓ నవ వధువు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

పెళ్లి చేసుకోబోతున్న సింగర్‌ సునీత?
టాలీవుడ్‌లో తన సుమధుర గానంతో అశేష అభిమానులను సంపాదించుకున్నారు సింగర్‌ సునీత.

అరంగేట్రంలో సచిన్‌ వారసుడు డకౌట్‌
కొలంబో: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వారసుడు అర్జున్‌ టెండూల్కర్‌ అండర్‌-19 అరంగేట్రం మ్యాచ్‌లో నిరాశపరిచాడు.

ఎగిరే కార్ల రేసులోకి ఆ కంపెనీ కూడా..
డ్రైవర్ అనే వాడే లేకుండా వాటంతట అవే నడిచే వాహనాలు రోడ్ల మీదకు వస్తాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top