ఒక్క క్లిక్‌తో నేటి ముఖ్యాంశాలు

Today News Roundup 19 June 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, అందుకే బడుగు బలహీనవర్గాలపై విరుచుకుపడుతున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత కొలుసు పార్థసారధి అన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ చాలా ప్రచారం చేసుకుందని, ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం ఏమని నిలదీశారో టీడీపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఏపీలో పెడబొబ్బలు పెట్టి.. ఢిల్లీలో ఎందుకలా?
సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, అందుకే బడుగు బలహీనవర్గాలపై విరుచుకుపడుతున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత కొలుసు పార్థసారధి అన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ చాలా ప్రచారం చేసుకుందని, ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం ఏమని నిలదీశారో టీడీపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.

‘చంద్రబాబు మమ్మల్నీ మోసం చేశారు’
సాక్షి, రాజమహేంద్రవరం : అబద్దపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరికి తమకు కూడా అన్యాయం చేశారని దివ్యాంగులు వాపోతున్నారు.

చిన్నాకు పెద్ద మనసు
(చిన్నా) ఆర్థికంగా స్థితిమంతుడైన ఓ యువ వ్యాపారి. అతను కావాలనుకుంటే పెళ్లికి కోట్ల రూపాయలు కట్నకానుకలుగా వస్తాయి. కానీ చిన్నా మాత్రం ఓ అనాథ యువతిని భార్యగా చేసుకోవాలని భావించాడు.

షికాగో సెక్స్‌రాకెట్‌: గుట్టువిప్పిన సినీతారలు
షికాగో : వరుస వివాదాస్పద ఘటనలు టాలీవుడ్‌ను కుదుపేస్తున్నాయి. క్యాస్టింగ్‌ కౌచ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు మరువకముందే షికాగో సెక్స్‌ రాకెట్‌ ఉదంతం తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి కలకలం రేపింది.

దారుణం.. వివాహితపై నలుగురు అత్యాచారం..
సాక్షి, నాగర్‌కర్నూల్ : మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు చేసింది. అయిన దేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. 

అనుకరించడం ఓ గొప్ప అనుభూతి
సాక్షి, హన్మకొండ : అహోసీత... అహో లక్ష్మణా.... మొదటిసారిగా త్రేతాయుగంలో మారీచుడు, రాముని గొంతుతో మాట్లాడి  వేరేవారి గొంతును అనుకరించడం విన్నాం.

జీరో టాలరెన్స్‌... అమెరికా వివరణ
వాషింగ్టన్‌ : అమెరికా సరిహద్దుల నుంచి వలసదారుల్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘జీరో టాలరెన్స్‌’  విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం ప్రకారం అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి వేర్వేరు కేంద్రాల్లో ఉంచుతారు.

కశ్మీర్‌ వినాశనంలో బీజేపీ పాత్ర లేదా!
సాక్షి, హైదరాబాద్‌: జమ్ముకశ్మీర్‌లో జరుగుతోన్న వినాశనంలో తన పాత్రేమీ లేనట్లు బీజేపీ బొంకడం విడ్డూరంగా ఉందని ఏఐఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. గడిచిన మూడేళ్లుగా పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు.

గౌరీ లంకేశ్‌ హత్య కేసు: హైకోర్టు సీరియస్‌
సాక్షి, బెంగళూరు: సంచలన సృష్టించిన జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య కేసులో కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితులను పోలీసులు హింసిస్తున్నారంటూ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టింది.

‘జూనియర్‌ పవర్‌ స్టార్‌ అనొద్దు’
నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్‌ తన పిల్లల గురించి సోషల్‌ మీడియాలో తరుచూ పోస్టింగ్స్‌ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. 

ఎయిరిండియా విక్రయం రద్దైందా?
న్యూఢిల్లీ : అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనేవారే కరువయ్యారు. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు గతంలో ఆసక్తి చూపించిన కంపెనీలు కూడా ఒక్కొక్కటిగా పక్కకి తప్పుకున్నాయి.

ఫుట్‌బాల్‌ జట్టుకు తప్పిన ప్రమాదం
రాస్తోవ్: సౌదీ అరేబియా ఫుట్‌బాల్ జట్టు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది.  రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌ కప్‌లో భాగంగా సౌదీ ఫుట్‌బాల్‌ ప్లేయర్లు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top