నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 10th May 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపుందుకున్నాయి. రాష్ట్రం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు నేతలు ఆకర్షితులవుతున్నారు.

వైఎస్సార్‌ సీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌
సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపుందుకున్నాయి. రాష్ట్రం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు నేతలు ఆకర్షితులవుతున్నారు.

జూన్‌ 2 నుంచి మరో విప్లవం: సీఎం కేసీఆర్‌
సాక్షి, హుజురాబాద్‌ : ప్రజలకు పాలనను చేరువచేసే క్రమంలో జూన్‌ 2 నుంచి మరో విప్లవాత్మక కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.

చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన..

ఆయుధాలతో స్వతంత్రం రాదు: ఆర్మీ చీఫ్‌
న్యూఢిల్లీ : కశ్మీరు యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులవ్వడం ఆందోళనకరమని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. ఈ సందర్భంగా రావత్‌.. ‘ఆయుధాలతో స్వతంత్రం సిద్దించదు.

తండ్రిగా గర్వంగా.. కొడుకుగా ఈర్ష్యగా ఉంది : నాగ్‌
కింగ్‌ నాగార్జున తన సోషల్‌ మీడియా పేజ్‌ లో ఓ ఆసక్తికర కామెంట్‌ చేశారు. ‘ఈ రోజు నేను తండ్రిగా గర్వపుడుతున్నా.. కొడుకుగా ఈర్ష్య పడుతున్నా.. నేను ఎప్పుడు నా తండ్రి లెజండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించలేదు.

సిరియాలో ఇజ్రాయెల్‌-ఇరాన్‌ బీభత్సం
జెరూసలేం : ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య వైరం ముదిరింది. సిరియాలో ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉన్న గోలన్‌ హైట్స్‌ ప్రాంతంపై బుధవారం అర్ధరాత్రి ఇరాన్‌ వరుసగా 20 క్షిపణులను ప్రయోగించింది.

టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది..
సాక్షి, గన్నవరం : నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు అబద్ధాలతో మోసపోయిన ప్రజానీకం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు సామినేని ఉదయభాను, యార్లగడ్డ వెంకటరావు అన్నారు.

200కు పైగా కంపెనీలపై బీఎస్‌ఈ వేటు
ముంబై : దేశీయ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్చేంజ్‌ బీఎస్‌ఈ భారీగా కంపెనీలపై వేటు వేసింది. 200కి పైగా కంపెనీలను మే 11 నుంచి డీలిస్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

చాలామంది ఇండియన్స్‌ కన్నా అమ్మే గొప్ప
సాక్షి, బెంగళూరు : కర్ణాటక సాధారణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటలీ దేశస్తురాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం తీవ్ర స్థాయిలో స్పందించారు.

వైరల్‌ : పిచ్చి పీక్‌ స్టేజ్‌కు వెళ్లింది..!!
సాక్షి, వెబ్‌ డెస్క్‌ : ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ ఫాంలలో లైక్స్‌, ఫాలోవర్స్‌ కోసం వెంపర్లాడటం ఎక్కువైపోయింది. ప్రాణాల మీదకు తెచ్చుకునేంత వరకూ చేరింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top