టుడే న్యూస్‌ రౌండప్‌

Today News Round Up 16 March - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ హక్కు ప్రత్యేక హోదా కోసం పట్టుసడలించకుండా వైఎస్సార్‌సీపీ కొనసాగించిన పోరు సత్ఫలితాలనిస్తోంది. హోదా ఇవ్వని కారణంగా కేంద్రంపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గురు, శుక్రవారాల్లో యావత్‌ జాతీయ మీడియా ఇదే అంశాన్ని ప్రధాన శీర్షికల్లో పొందుపర్చింది. టీడీపీ కూడా వైఎస్సార్‌సీపీ బాటనే అనుసరిస్తూ అవిశ్వాసం పెడతాని ప్రకటించడంతో రాబోయే రోజుల్లోనూ ‘ఏపీకి హోదా’ అంశమే హైలైట్‌ కానుంది.

‘అవిశ్వాసం’పై మాట్లాడిన లోక్‌సభ స్పీకర్‌..
ఆంధ్రప్రదేశ్‌ హక్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్పందించారు.

ఎవరిదైనా పర్వాలేదు..రాష్ట్రం ముఖ్యం : వైఎస్‌ జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత ముఖ్యమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.

బీజేపీ నుంచి టీడీపీ విడిపోవడం సంతోషం..
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ ఆరోపించారు.

‘పవన్‌పై పోటీచేసి సత్తా చూపిస్తా’
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బీజేపీ చేతుల్లో ఉన్నారనే విషయాన్ని మూడు నెలల క్రితమే చెప్పానని టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి తెలిపారు. 

చైర్మన్ బాగానే ఉన్నా.. ఆస్పత్రిలో ప్రత్యక్షం!
అనర్హత వేటుపడ్డ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుపై పిటిషనర్ తరపు న్యాయవాది రవిశంకర్ జంధ్యాల తన వాదనలు వినిపించారు. 

ఉబర్‌లో వెళుతున్నారా? అయితే ఇది మీకోసమే..
 ప్రయాణ హడావుడిలో సాధారణంగా ప్రయణికులు అపుడపుడూ తమ వస్తువులను మరిచిపోవడం.. ఆనక గాభరా పడడం మనకు తెలిసిందే. 

‘కిరాక్‌ పార్టీ’ మూవీ రివ్యూ
రుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కిరాక్‌ పార్టీ. ప్రయోగాలను పక్కన పెట్టి కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన కిరిక్‌ పార్టీ సినిమాను తెలుగులో కిరాక్‌ పార్టీ పేరుతో రీమేక్‌ చేశాడు నిఖిల్.

ఆన్‌లైన్‌లో ఐపీఎల్‌ టికెట్లు
ఐపీఎల్ 11వ సీజన్‌కు ఇంక కొన్ని రోజులే మిగులున్నాయి. క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌11 సీజన్‌ టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top