వెలుగోడులో పెద్దపులి

Tiger In Velugodu Kurnool District - Sakshi

రెండు పిల్లలతో కందిచేలో మకాం

ఆత్మకూరు రూరల్‌: ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని వెలుగోడు పట్టణ సమీపంలో బుధవారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. పట్టణ శివారులోని జమ్మి నగర్‌కు ఆనుకుని ఉన్న ఒక కంది చేలో పెద్దపులి తన రెండు పిల్లలతో స్థానికులకు కనిపించింది. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆత్మకూరు, నంద్యాల డీఎఫ్‌ఓలు సెల్వం, శివప్రసాద్‌ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.

పులి తన పిల్లలతో తనంతట తానే అడవిలోకి వెళ్లే వరకు వేచి చూడాలని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ జనారణ్యంలోకి రావాలని చూస్తే బంధించడానికి బోను సిద్ధం చేశారు. బుధవారం పొద్దుపోయే వరకు  అటవీ సిబ్బంది కంది చేను సమీపంలోనే ఉన్నారు. పులులు ఊరి సమీపంలోనే ఉన్నాయన్న సమాచారం తెలియడంతో పట్టణ వాసులు  పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top