తమ్ముళ్లకు టెం‘డర్’

తమ్ముళ్లకు టెం‘డర్’ - Sakshi


ఎన్‌ెహచ్-67 పనులకు పోటాపోటీగా దాఖలైన టెండర్లు

తొలుత 14.5 శాతం అధికంగా కోట్‌చేసిన తెలుగుతమ్ముళ్లు

రూ.26.5 కోట్లు అప్పనంగా దక్కించుకునే ఎత్తుగడలు

వెలుగులోకి రావడంతో టెండర్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

రీ టెండర్లలో తెలుగుతమ్ముళ్ల  ఎత్తుగడలు విఫలం


 

అధికారాన్ని అడ్డుపెట్టుకొని అప్పనంగా ఆర్జించేందుకు వేసిన ఎత్తుగడలు చిత్తయ్యూరుు. రూ.26కోట్ల ప్రజాధనం కొల్లగొట్టేందుకు చేసిన కుయుక్తులు పారలేదు. నేషనల్ హైవే-67 రోడ్డు పనులకు నిర్వహించిన రీ టెండర్లలో కాంట్రాక్టు సంస్థలు పోటాపోటీగా తక్కువ ధరలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. దీంతో జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఆ ఇద్దరు నాయకులు ఖంగుతిన్నారు. తాజాగా 10 శాతం లెస్‌కే ఓ కంపెనీ టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం. అదే నిజమై టెండర్లు ఖరారు అరుుతే ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డుకట్టపడినట్లే.

 

సాక్షి ప్రతినిధి, కడప : నేషనల్ హైవే-67 రోడ్డు విస్తరణలో భాగంగా జిల్లాలోని బద్వేల్, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో గత డిసెంబర్‌లో టెండర్లు ఆహ్వానించారు. రూ.183 కోట్లు పనులకు ఈ పొక్యూర్‌మెంట్ ద్వారా తొలుత నిర్వహించిన టెండర్లుల్లో ఎస్‌ఆర్కే, రిత్విక్, బీవీఎస్‌ఆర్, కెసీపీఎల్ కాంట్రాక్టు సంస్థలు పోటీ పడ్డాయి. ఆ నాలుగు కాంట్రాక్టు కంపెనీలు కూడా అధికారపార్టీ నేతల కనుసన్నుల్లో ఉండడంతో సులువుగా పోటీ లేకుండా సర్దుబాటు చేసుకున్నారు. పోటీ నుంచి మిగిలిన రెండు సంస్థలను వైదొలిగేలా చేసి రిత్విక్, ఎస్‌ఆర్కే జాయింట్ వెంచర్‌గా 14.5శాతం అధిక ధరలకు టెండర్లు దాఖలు చేసేలా వ్యవహరించారు.



ఆమేరకు రూ.26.5కోట్లు అప్పనంగా ఆర్జించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అదనపు మొత్తాన్ని జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు పంపిణీ చేసుకుని, రోడ్డు పనులు ప్రభుత్వ రే ట్లకు పనులు చేపట్టేలా రెండు సంస్థలకు అప్పగించాలని పథక రచన చేశారు. ఈవైనాన్ని సాక్షి బట్టబయలు చేసింది. రూ.26.5 కోట్లు కొల్లగొట్టే ఎత్తుగడలను వెలుగులోకి తెచ్చింది. దీంతో ఈ పనులతోపాటు బళ్లారి నుంచి చేపట్టే రోడ్డు పనులకు నిర్వహించిన టెండర్లలో కూడా సుమారు రూ.100 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని గుర్తించిన ప్రభుత్వం వాటిన్నటిని రద్దు చేసింది. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, కాంట్రాక్టర్‌గా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన మరోనేత వేసిన ఎత్తుగడలు చిత్తయ్యూరుు. రీటెండర్లును ఈనెల 9న నిర్వహించింది.



అందులో కూడా అధికార పార్టీ నేతలు రింగ్ చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. పలువురు పోటీకి రావడంతో బెదిరింపులు, పైరవీలు ముమ్మరంగా కొనసాగించారు. అయితే వారి ఎత్తుగడలు విఫలమైనట్లు తెలుస్తోంది. రాఘవ-రాంకీ కన్‌స్ట్రక్షర్స్ జాయింట్ వెంచర్, ప్రోగ్రెస్సీవ్ కాంట్రాక్టు సంస్థ, బివిఎస్‌ఆర్, రిత్విక్-ఎస్సార్కే జాయింట్ వెంచర్, ఈసీఐఎల్‌లతో పాటు మరో రెండు సంస్థలు టెండర్లలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.



పోటాపోటీగా టెండర్లు దాఖలు కావడంతో పలు కాంట్రాక్టు సంస్థలు లెస్‌కు దాఖలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ సంస్థ సుమారు 10శాతం తక్కువ రేట్లకు టెండర్ దాఖలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే నిజమైతే సుమారు రూ.55కోట్లు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నిలిచినట్లే. కాగా టెక్నికల్ బిడ్‌లు ఢిల్లీలో తెరిచిన అనంతరం వారం రోజుల్లో టెండర్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top