‘ప్రజా సంకల్పం’పై ప్రభుత్వ కుట్ర !

TDP on ys jagan foot trip - Sakshi

పాదయాత్రకు అనుమతి కావాలంటూ వ్యాఖ్యలు

విధ్వంసం జరగవచ్చంటూ టీడీపీ నేతల విమర్శలు

జగన్‌పై దుమ్మెత్తిపోయాలంటూ టీడీపీ శ్రేణులకు సీఎం పిలుపు

సర్కారు చర్యలపై మండిపడుతున్న వైఎస్సార్‌సీపీ

పాదయాత్రకు పెరుగుతున్న ప్రజాసంఘాల మద్దతు

మూడేళ్ల పాలనను జగన్‌ ఎండగడతారనే వ్యతిరేక ప్రచారం: మేధావులు

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రజా సంకల్పం’పై సర్కారు కుట్రలు మొదలయ్యాయి. పాదయాత్రకు అనుమతి కావాలంటూ టీడీపీ ప్రభుత్వం తెరవెనుక కుట్రలు ప్రారంభించింది. పాదయాత్రవల్ల విధ్వంసం జరగవచ్చంటూ టీడీపీ నేతలు, మంత్రులూ విమర్శలు మొదలుపెట్టారు. పాదయాత్రను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని జగన్‌పై దుమ్మెత్తి పోయండంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి చేయతలపెట్టిన ‘ప్రజాసంకల్పం’ పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా తెర వెనుక కుట్రలను ప్రారంభించింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ప్రజల కోసం పాదయాత్రలు చేయడానికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. ఏ నాయకుడైనా సరే పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై ఎలుగెత్తి చాటుతూ పరిష్కరించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తుంటారు. కానీ జగన్‌ పాదయాత్రను సంకల్పించడమే నేరమైనట్లుగా చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఇతర టీడీపీ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేయడం చూస్తుంటే ప్రజా సంకల్పాన్ని అడ్డుకోవాలనే కుట్ర బుద్ధి కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.

పాదయాత్రలు కొత్తేమీ కాదు...
పాదయాత్రలు చేయడం రాష్ట్రంలో కొత్తేమీ కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మొదలు పలువురు ప్రజలతో కలిసి నడిచారు. సాక్షాత్తూ చంద్రబాబునాయుడే 2014 ఎన్నికల ముందు యాత్ర చేశారు. పాదయాత్రల సందర్భంగా ఎçప్పుడూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన దాఖలాలు గానీ లేవు.

అలాంటిది కొత్తగా, జగన్‌ పాదయాత్ర చేస్తే ఏదో జరిగిపోతుందని చంద్రబాబు తమ పార్టీ అంతర్గత సమావేశాల్లో శ్రేణులకు నూరిపోయడం విమర్శలకు దారి తీస్తోంది. ‘పాదయాత్రను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని జగన్‌పై దుమ్మెత్తి పోయండి’ అని చంద్రబాబు పిలుపునివ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు దుయ్యబడుతున్నారు.

‘రాష్ట్రంలో సమస్యలున్న విషయం వాస్తవం.... 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీల వలలో చిక్కుకుని మోసపోయిన బాధితులు ప్రస్తుతం ఆవేదనతో అలమటిస్తున్న మాట నిజం... రైతుల రుణాల మాఫీ మొదలు మేనిఫెస్టోలో ప్రకటించిన సుమారు 600 హామీల్లో ఒక్కటైనా నెరవేరని నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా వారి వద్దకు వెళ్లి పరామర్శించడం తప్పెలా అవుతుంది?’ అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబే అసలైన కుట్రదారుడు
పాదయాత్ర నేపథ్యాన్ని చంద్రబాబు వక్రీకరిస్తూ విధ్వంసం, కుట్రలు అంటూ వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే కుట్రను తానే స్వయంగా పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పాన్ని ఒక నేరపూరిత కార్యక్రమం అన్నట్లుగా చంద్రబాబు ప్రజాస్వామ్యంలో మితిమీరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. యాత్రకు అనుమతి కావాలంటున్న చంద్రబాబునాయుడు గతంలో తాను పాదయాత్ర చేసినపుడు ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు.

ప్రతిపక్ష నాయకుని బాధ్యతను ప్రశ్నించే హక్కే ముఖ్యమంత్రికి లేదని తేల్చి చెప్పారు. ప్రజాసంకల్పం ప్రారంభంతో తన కౌంట్‌ డౌన్‌ మొదలవుతుందేమోనన్న భయం చంద్రబాబుకు పట్టుకున్నదని, అందుకే ఆయన కుట్ర చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్‌.కె.రోజా విమర్శించారు. ఈ రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబేనని దుయ్యబట్టారు.

ఆయన సొంత మామ ఎన్టీఆర్, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, లక్ష్మీపార్వతి, పురంధేశ్వరి, హరికృష్ణ , స్వయానా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గతంలో ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు రక్తంలో కుట్రలు, కుతంత్రాలే ప్రవహిస్తున్నాయని చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు అబద్ధపు హామీలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో అవినీతి బాగోతం, రాజధాని పేరుతో ప్రజలను, రైతులను మభ్య పెట్టడం, ఏపీ జీడీపీ వృద్ధిరేటులోని డొల్లతనం వంటి అంశాలన్నీ జగన్‌ ఎండగడతాడనే భయంతోనే టీడీపీ శ్రేణులు జగన్‌ యాత్రపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారనేది మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.

సమధికోత్సాహంలో పార్టీ శ్రేణులు
చంద్రబాబు, ఆయన బృందం పాదయాత్రపై ఎన్ని విమర్శలు చేస్తున్నా వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రం వాటిని లెక్క చేయకుండా ప్రజాసంకల్పం ప్రారంభం కోసం సమధికోత్సాహంతో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే పాద యాత్ర ముందస్తుగా తమ వంతు సహాయ సహకారాలు ఏ విధంగా అం దించాలనే విషయంలో పార్టీ అనుబంధ సంఘాల నేతలంతా సమావేశమై చర్చించారు. రాష్ట్రవ్యా ప్తంగా దేవాల యాలు, మసీదులు, చర్చిల్లో  పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పాదయా త్రను తాము స్వాగతిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఇప్పటికే ప్రకటించారు. జగన్‌ ప్రజాసంకల్పంకు రాష్ట్రంలోనే కాక దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పార్టీ అభిమానులు, విదేశాల్లోని ఎన్నారైలు మద్దతు పలుకుతూ ప్రకటనలు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top