అక్రమార్కుల గుండెల్లో దడ

TDP Leaders Fear on YS Jagan Statement on Polavaram Corruption - Sakshi

పోలవరం అవినీతిపై చర్యలుంటాయన్న జగన్‌ ప్రకటనతో దేశం నేతల్లో కలవరం

పోలవరం ప్రాజెక్టు పేరుతో రూ.కోట్లు దోచేసిన తెలుగుతమ్ముళ్లు

చెట్టు–పుట్ట పేరుతో భారీగా అవినీతి

లేనివి ఉన్నట్లు చూపి సొమ్ము  స్వాహా

పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్యలు ఉంటాయని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో తెలుగుతమ్ముళ్లలో కలవరంమొదలైంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నేతలు రూ.వందల కోట్లు కూడబెట్టారు. దీనికి చంద్రబాబునాయుడు సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్‌ అధికారులు కూడా అండగా నిలిచారు. ఇప్పుడు వారందరిలో వణుకు మొదలైంది. ఢిల్లీలో జరిగిన విలేకరులసమావేశంలో పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై చర్యలు ఉంటాయని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో తెలుగుతమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.  

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలలోని జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం మండలాల్లో పోలవరం నిర్వాసితుల కోసం కేటాయించేందుకు చేసిన భూముల కొనుగోలులో తెలుగుదేశం నేతలు రూ.కోట్లు కొట్టేశారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పరిధిలో రూ.50 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి. జిల్లా అధికారులు కూడా తమ విచారణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేల్చారు. కొందరు ఉద్యోగులపై వేటు కూడా వేశారు. అయితే అక్రమాలకు పాల్ప డిన తెలుగుదేశం పార్టీ నాయకులను వదిలి ప్రయివేటు ఉద్యోగులపై నామమాత్రపు చర్యలు తీసుకోవడం విమర్శలకు దారితీసింది. ఇక జీలు గుమిల్లి మండలం దర్భగూడెం, స్వర్ణవారిగూడెం గ్రామాల్లో ఒకే భూమికి రెండుసార్లు పరిహారం తీసుకున్నారు. చింతలపూడి ఎత్తిపోతల కాలువలో భూమి పోయినా అదే భూమిని మళ్ళీ పోలవరం నిర్వాసితులకు అమ్ముకుని ప్రభుత్వం నుండి పరిహారం కాజేశారు. ఇక భూమి లేక పోయినా భూమి ఉన్నట్లు చూపి పరిహారం తీసుకున్నారు. స్వయంగా అధికారపార్టీకి చెందిన మండలాధ్యక్షుడే ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు తెలిసినా అధికారులు చర్యలు తీసుకోలేదు.

లేనివి ఉన్నట్లు చూపి రూ.కోట్లు కొట్టేశారు
తాడువాయి, స్వర్ణవారిగూడెం, దర్భగూడెంలో అధికార పార్టీకి చెందిన నేతలు పొగాకు బ్యారన్లు, బోర్లు, ఆయిల్‌పామ్‌ తోటలు, టేకు చెట్లు, అటవీ వృక్షజాతుల చెట్లు అంటూ లేనివి ఉన్నట్లు చూపి రూ.కోట్లలో పరిహారం కాజేశారు. పనిలో పనిగా పక్కవాళ్ళ పొగాకు బ్యారన్లకు, ఆయిల్‌పామ్‌ తోటలను సైతం తమవేనని చూపించి పరిహారం తీసుకున్నారు. నిజమైన లబ్ధిదారులు ఈ బ్యారన్లు తమవేనని, ఆయిల్‌పామ్‌ తోటలకు మాకుపరిహారం ఇవ్వమని అధికారుల చుట్టూ ఎన్ని ప్రదక్షణలు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. స్వర్ణవారిగూడెం గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు లేనివి, తనవి కానివి ఉన్నట్లు చూపి ఆరు కోట్ల రూపాయలు కాజేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక దర్భగూడెం రెవెన్యూ పరిధిలో లేని బోర్లు ఉన్నట్లు చూపి బోరుకు ఆరు లక్షల రూపాయలు చొప్పున 42 బోర్లకు పరిహారం కాజేశారు. వాస్తవంగా భూమి లేక పోయినా లేని భూమిని సైతం అడంగల్, 1బి, పట్టాదారు పాస్‌ పుస్తకాలలో చూపించి పరిహారం కాజేసారు. దర్భగూడెంలో, స్వర్ణవారిగూడెం గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు అమ్ముకున్న భూములకు సైతం రైతుల వద్ద కమీషన్లు దండుకున్నారు. రైతులకు ఇచ్చే పరిహారం రైతుల ఖాతాల్లోనే జమ చేస్తారు. కాని దర్భగూడెంలో రైతులకు ఇచ్చే పరిహారం రైతుల ఖాతాల్లో కాకుండా వేరే వాళ్ళ ఎకౌంట్లలో పరిహారం జమ చేసి రైతులకు తోచిన కాడకు ఇచ్చారు. ఇదే అదనుగా దర్భగూడెంలో రూ.3.89 కోట్ల మేరకు పండ్లతోటల పరిహారం పక్కదారి పట్టించారు. దర్భగూడెం రెవెన్యూ పరిధిలో భూములకు పరిహారం ఒకసారి, ఉద్యానవన పంటల విలువల కోసం అంటూ మరోసారి పరిహారం ఇచ్చి అక్రమాలకు తెరలేపారు. భూముల కొనుగోలులో అక్రమాలే కాదు నిర్వాసితులకు కేటాయించిన భూములలో కూడా నేతలు దందాలకు తెరలేపారు. నిర్వాసితులకు కేటాయించిన భూములను తక్కువ ధరకు కౌలుకు తీసుకుని భూముల్లో గల విలువైన టేకు చెట్లు, అటవీజాతి వృక్ష సంపదను అమ్ముకున్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నేతల అండదండలతో అక్రమాలకు పాల్పడిన తమ్ముళ్ళకు అధికారం పోవడంతో గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

పూర్తిస్థాయి విచారణ జరిపించాలి
అధికారం అడ్డం పెట్టుకుని సర్వం దోచుకుతిన్నారు. ఒకే భూమికి రెండుసార్లు పరిహారం తీసుకున్నారు తెలుగుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఉండవల్లి సోమ సుందరం. నిర్వాసితుల భూములను తక్కువ కౌలుకు తీసుకుని భూముల్లో ఉన్న విలువైన చెట్లు అమ్ముకున్నారు. వీరిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.– గూడవల్లి శ్రీనివాసరావు, స్వర్ణవారిగూడెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top