కోడ్‌ వచ్చినా పరికరాల పంపిణీ

TDP Distributes Missions in East Godavar After Election Code - Sakshi

ఎన్నికల అధికారులకు   ఫిర్యాదు

మీడియా రాకతో పంపిణీ నిలిపివేత

చర్యలు తీసుకుంటామన్న ఏఈఆర్వో సందీప్‌

తుని: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా బీసీ కార్పొరేషన్‌ ఉద్యోగులు చేతి వృత్తుల పనివార్లకు పరికరాలను పంపిణీ చేశారు. ఆది వారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో కుట్టుమెషీన్లు, సెలూన్‌ చైర్లు తదితర వస్తువులను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి పలువురికి టోకెన్లు ఇచ్చారు. ఈ విషయం ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లింది. సమాచారం తెలుసుకొని మీడియా వెళ్లడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇస్తున్నామని సిబ్బంది డీవీ సత్యనారాయణ, వి.జోగారావులు తెలిపారు. ఎమ్మెల్సీ కోడ్‌ అమల్లో ఉంది కదా ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తే కోడ్‌ వర్తించదని ఉన్నతాధికారులు మౌలిక ఆదేశాలు ఇచ్చారని సమాధానమిచ్చారు.

సార్వత్రిక కోడ్‌ వచ్చాక ఎలా పంపిణీ చేస్తారని అడిగితే ఫోన్లో అధికారులతో మాట్లాడి నిలిపివేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు అధికారుల తీరుపై ఆసహనం వ్యక్తం చేశారు. కోడ్‌ ఉన్నప్పుడు ఎందుకు రమ్మన్నారని సిబ్బందిని నిలదీశారు. ఆ విషయాన్ని ఏఈఆర్వో సందీప్‌ దృష్టికి తీసుకువెళ్లగా విచారణ జరిపించి బాధ్యలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందటానికి అధికార పార్టీ తాయిలాలను ఎర వేస్తుందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ విషయంలో అలసత్వం వహించిన బీసీ కార్పొరేషన్‌ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలుడిమాండ్‌ చేశాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top