చరిత్రాత్మక స్వాగతం పలకాలి

Tammineni Seetharam Pressmeet on Praja Sankalpa Yatra - Sakshi

ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేయాలి కెల్ల గ్రామం నుంచి  

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లాలో వీరఘట్టం మండలం కెల్ల గ్రామం వద్ద ప్రారంభం కానుందని, ఈ సందర్భంగా చరిత్రలో నిలిచిపోయేలా స్వాగతం పలకాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  దేశ చరిత్రలో నిలిచిపోయేలా 300 రోజు లు, 3వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేయగలిగారంటే అదంతా ప్రజాభిమానమేనన్నారు. ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న ఆ బహుదూరపు బాటసారికి వజ్ర సంకల్పంతో స్వాగతం పలికేందుకు ప్రజలంతా ఉవ్విల్లూరుతున్నారని చెప్పారు. 

ఇప్పటికే కెల్లలో వైఎస్సార్‌సీపీ నాయుకులంతా స్థల పరిశీలన చేసి ఎటువంటి అవాంతరాలు లేకుండా స్వాగత ఏర్పాట్లు పూర్తిచేశారన్నారు. ఇచ్ఛాపురంలో ముగింపు సభ చరిత్రకెక్కాలన్నారు. జగనన్న వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో పండగ వాతావరణం నెలకొందన్నారు. ప్రజాస్వా మ్య వ్యవస్థలో రాజకీయంగా ఎదుర్కొవాలే తప్పా ప్రతిపక్ష నేతపై దాడికి పాల్పడి భయపెట్టాలనుకనే పిరికిపంద చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం లేకుండా ఒంటరిగా హిట్లర్‌ పాలన కొనసాగించాలనే ధ్యేయంతో ఉన్న చంద్రబాబుని ప్రజలు క్షమించరన్నారు. సమావేశంలో పార్టీ నేతలు కోరాడ రమేష్, గం ట్యాడ రమేష్, టి.కామేశ్వరి, పేడాడ అశో క్, కూన కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top