ఆరోపణలపై నిగ్గు తేలుస్తాం: పృథ్వీరాజ్‌

SVBC chairman Prudhvi Raj Assured Regularisation Of Contract Employees - Sakshi

సాక్షి, తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో గతంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆ ఛానల్‌ చైర్మన్‌ పృథ్వీరాజ్‌ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. భక్తి ఛానల్‌ అక్రమాల మీద చాలా ఆరోపణలు ఉన్నాయని, వాటన్నింటినీ నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. అలాగే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఒప్పిస్తామని పృథ్వీరాజ్‌ పేర్కొన్నారు. సీఎం కాళ్లు పట్టుకుని అయినా ఎస్వీబీసీలో పనిచేస్తున్న 286 మంది ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక సినిమా పరిశ్రమలోని కొందరు.. జగన్‌ ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. అనవసరపు మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ‍్చరించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడనన్న పృథ్వీరాజ్‌.. ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటన తన ఓటర్‌ కార్డుతో పాటు ఆధార్‌ను తిరుపతికే మార్చుకున్నట్లు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top