తీపి కబురు

Sugar Factory Reopen After Elections in Andhra Pradesh - Sakshi

అధికారంలోకి రాగానే సుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తా

జగన్‌ హామీతో లక్షలాది మంది రైతుల్లో ఆనందం

జనసంద్రమైన ఆమదాలవలస బహిరంగ సభ

319వ రోజు ప్రజాసంకల్పయాత్ర విజయవంతం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అన్నదాతల అభిమానం కట్టలు తెంచుకుంది. ఆనందం అవధులు దాటింది. దృఢ సంకల్పం తో ప్రజాసంకల్పయాత్రగా వస్తూ వస్తూనే ‘చక్కెర’ లాంటి భరోసా ఇస్తూ యావత్తు రైతుల కుటుం బాల్లో రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పా ర్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతో షం నింపారు. ఆయనను చూసేందుకు ఆమదాలవల స నియోజకవర్గ జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పాటు ఎన్నో ప్రయాసలను సైతం పక్కనపెట్టి వేలాదిగా జనం రావడంతో ఆమదాలవలస జనసంద్రమైం ది. ఎటుచూసినా కనుచూపుమేరలా జనంతో నిం డిపోవడంతో పట్టణమంతా పండగ వాతావర ణం కనిపించింది. పట్టణంలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభ ఉత్సాహంగా సాగింది. ఇదిలావుంటే జగన్‌ తన ప్రసంగం ప్రారంభిస్తున్నప్పుడే పెద్ద సంఖ్యలో యువకులు ‘సిఎం..సిఎం.. సిఎం...’ అంటూ నినాదాలు చేశారు.

చంద్రబాబు, ఎమ్మెల్యే అక్రమాలకు అడ్రస్‌లు
మంగళవారం నాటి సభలో జగన్‌ ప్రసంగం చాలా ఆసక్తికరంగా సాగింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు మద్దతిచ్చిన ప్ర జాకూటమికి తగిలిన ఎదురుదెబ్బను జగన్‌ వివరించారు. చంద్రబాబు నాటకాలను తెలుగు రా ష్ట్రాల ప్రజలెవ్వరూ నమ్మరని తాజా ఫలితాలతోనే తేలిపోయిందని చెప్పడంతో జనాల్లో హర్షం వ్యక్తమైంది. అలాగే చంద్రబాబు చేస్తున్న దోపిడీ, అక్రమాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్‌ చేస్తున్న అక్రమాలపై జగన్‌ తీవ్రంగా విమర్శించారు. ఇసుక దోపిడీలో నాగావళి, వంశధార నదులను వదిలిపెట్టలేదని, వందలాది కోట్లు దోచేశారని, ఇందులో చినబాబు నుంచి పెదబాబు వరకు కమీషన్లు వెళ్తాయని చెప్పడాన్ని ప్రజ లు ఆసక్తిగా విన్నారు. ఎమ్మెల్యే కూన రవి ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తూ అక్రమాలు చేస్తూ ‘ చోటా డాన్‌’లా తయారయ్యాడని జగన్‌ అనడంతో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ఇదే క్రమంలో ‘మనవాళ్లు బ్రీఫ్డ్‌ మి..’ అంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఉదంతాన్ని జగన్‌ గుర్తు చేశారు. ఇసుకతో రూ.కోట్లు దోచుకున్నారని, అలాగే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారని వివరాలతో చెప్పడంతో జనం చప్పట్లు కొట్టారు. అలాగే దూసిలోని కాన్‌కాస్ట్‌ యాజమాన్యం ఈ టీడీపీ నేతలకు కమీషన్లు ఇవ్వలేక 800 మంది కార్మికులను రోడ్డున పడేసి ఫ్యాక్టరీని మూసేశారని చెప్పారు.

సుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తానంటూ జగన్‌ హామీ
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్‌ తన ప్రసంగంతో యావత్తు రైతాంగానికి వరాల జల్లు కురిపించారు. దివంగత నేత వైఎస్సార్‌ లాగానే జగన్‌ కూడా తమ పక్షపాతిలా వరాలు కురిపిం చారంటూ రైతులు చర్చించుకుంటున్నారు. స్థానిక నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా రైతుల ఉపాధికి ప్రధాన ఆధారమైన ఆమదాలవలస సుగర్‌ ఫ్యాక్టరీని తాను అధికారంలోకి రాగానే తెరిపిస్తానని జగన్‌ హామీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తీరా అధికారంలోకి వచ్చినా టీడీపీ ప్రభుత్వం ఆ హామీని గాలికొదిలేసిన నేపథ్యంలో తాజాగా జగన్‌ ఇచ్చిన హామీ ఈ ప్రాంత రైతులకు పూర్తి భరోసా కలిగించింది. ఈ వరం సాకారమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఒక లక్ష మందికి పైగా రైతుల వర్గాలకు మేలు చేకూరనుంది. అలాగే జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది రైతులకు కూడా లాభదాయకమైన ఎన్నో పథకాల హామీలను జగన్‌ ప్రకటించారు.

రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని, అలాగే కరువు కాటకాలు, విపత్తులతో పంట నష్టపోయిన వారికి ఆసరాగా ఉండే వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రూ.4వేల కోట్లతో కెలామటీ (విపత్తు) రిలీఫ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధులతో బాధిత రైతులకు వెంటనే సాయం అందే వీలుంటుంది. అలాగే రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని, అక్వా రైతులకు తక్కువ టారిఫ్‌తో విద్యుత్‌ అమలు, నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజి ఏర్పాటు చేయనున్నట్లు జగన్‌ ప్రకటించారు. అలాగే పాడి రైతులను ప్రోత్సహించేలా సహకార డెయిరీల ద్వారా లీటర్‌కు రూ.4 చొప్పున సబ్సిడీ వచ్చేలా చేస్తానని, రైతుల వినియోగ ట్రాక్టర్లకు పూర్తిగా రోడ్డు టాక్స్‌ రద్దు చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే, బీమాగా మృతుని భార్యకు ఆడపడుచు ఆస్తిగా రూ.5 లక్షల వరకు వచ్చేలా వైఎస్సార్‌ భీమా పథకాన్ని అమలు చేస్తామని, దీనిపై అసెంబ్లీలో చట్టం చేస్తానని ప్రకటించడం పైనా రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

జోరుగా హుషారుగా పాదయాత్ర
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీకాకుళం మండలం నందగిరిపేట నుంచి జగన్‌ పాదయాత్ర ప్రారంభమైంది. సనపలవానిపేట, చింతాడల మీదుగా ఆమదాలవలస నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. అనంతరం బ్రిడ్జి రోడ్డు మీదుగా ఆమదాలవలస పట్టణం ప్రధాన రోడ్డు, రైల్వేస్టేషన్‌ రోడ్డు మీదుగా కళాశాల రోడ్డు వరకు సాగింది. సాయంత్రం బహిరంగ సభ నిర్వహించారు. తర్వాత క్రిష్ణాపురం వరకు పాదయాత్ర నిర్వహించి అక్కడే రాత్రి బస చేశారు. ఈ యాత్రలో భాగంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు, నర్సింగ్‌ ఉద్యోగులు, సీపీఎస్‌ ఉద్యోగులు, షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించాలంటూ రైతులు, మాజీ సైనికోద్యోగులు తదితరులతో పాటు పలువురు అనారోగ్య బాధితులు జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.

పాల్గొన్న నేతలు
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్‌ వెంట పలువురు నేతలు అడుగులు కలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్‌ కోఆర్డి నేటర్‌ భూమన కరుణాకరరెడ్డి, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళా వతి, కంబాల జోగులు, పిఎసి సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే ముదనూరి ప్రసాదరాజు, శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు చింతాడ మంజు, పార్టీ నేతలు సువ్వారి గాంధీ, కిల్లి సత్యన్నారాయణ, తమ్మినేని చిరంజీవినాగ్, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బొడ్డేపల్లి అజంతా తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top