కోవిడ్‌ ఆస్పత్రులకు ప్రత్యేక కాల్‌సెంటర్‌

Special Call Centre for Covid-19 Hospitals In AP - Sakshi

91008 59355, 91008 64322 నంబర్లు కేటాయింపు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను, సందేహాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు కోవిడ్‌–19 ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. నెల్లూరు, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌ బాధితులకు మాత్రమే వైద్యసేవలు అందిస్తున్నారు. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యిమందికి పైగా పనిచేస్తున్నారు. 

► ఈ నాలుగు ఆస్పత్రుల్లో సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే 91008 59355, 91008 64322 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు
► పాజిటివ్‌ రోగులకు ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్స్‌కు సంబంధించి సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు.
► వెంటిలేటర్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన విషయాలకూ ఫోన్‌చేయవచ్చు.
► వైద్య ఉపకరణాలు ఏవైనా అవసరమైనప్పుడు ఈ నంబర్లకు కాల్‌ చేయవచ్చు.
► పేషెంట్‌ పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు ఎలాంటి వైద్యం అందించాలన్నదానిపై ఈ నంబర్లకు ఫోన్‌ చేసి సలహాలు తీసుకోవచ్చు.
► ఈ రెండు నంబర్లు రాష్ట్ర కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించి ఉంటాయి.
► అక్కడ నిపుణులైన వైద్యులతో పాటు డీఎంఈ, ప్రజారోగ్య సంచాలకులు, ఐఏఎస్‌ అధికారులు ఉంటారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top