జగనన్న మా శ్రమను గుర్తించారు

Self-help communities Happy With YS Wages Announcement In Kurnool - Sakshi

రూ.10వేల వేతనం ప్రకటించడం సంతోషం

ఆయన సీఎం అయితే మా కుటుంబాలు బాగుపడతాయి

వెలుగు యానిమేటర్ల హర్షం

కర్నూలు(హాస్పిటల్‌):   యానిమేటర్లు.. వీరు గ్రామాల్లో   అందరికీ సుపరిచితులు. స్వయం సహాయక  సంఘాలకు వారే వెన్నుదన్ను. సంఘాల కార్యకలాపాలన్నీ రికార్డు చేసేది వారే.  ఈ పనుల్లో కొందరు ఐదేళ్ల నుంచి ఉండగా, మరికొందరు పదేళ్లు, ఇంకొందరు 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు.     గ్రామంలో పొదుపు సంఘాలన్నింటికీ అకౌంటెంట్, అసిస్టెంట్‌ పనిచేస్తారు. పొదుపు గ్రూపులకు రుణాలు ఇప్పించడం, ఆన్‌లైన్‌లో వివరాలు ఎక్కించడం, చంద్రన్నబీమా, అభయహస్తం, పంట రుణాల వివరాల నమోదు,  మొక్కల పెంపకం, వ్యక్తిగత మరుగుదొడ్లు జియోట్యాగింగ్‌ తదితర పనులన్నీ యానిమేటర్లే నిర్వహిస్తారు. కానీ వీరి శ్రమకు తగ్గ ఫలితం ఏమీ ఉండదు.

ఏదైనా వేతనం ఇవ్వాలని ప్రభుత్వాలను కోరితే మీరు మాకు సంబంధం లేదు, గ్రామంలోని గ్రూపులే నియమించుకున్నాయి కాబట్టి వారి వద్దే తీసుకోండని చెబుతూ వచ్చాయి. ఇలా చెబుతూనే ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ వారిని వాడుకుంటున్నాయి. సంఘాల రుణాలపై వచ్చే వడ్డీలో నుంచి కొంత మొత్తాన్ని మాత్రమే వీరికి అందజేస్తారు. నెలకు రూ.500  నుంచి రూ.1000లోపు మాత్రమే చాలా మందికి అందుతుంది.  జిల్లాలో 47,982 స్వయం సహాయక సంఘాల్లో 4,95,679 మంది సభ్యులు ఉన్నారు. వీరు 2014 గ్రామైక్య సంఘాలుగా, 54 మండల మహిళా సమాఖ్యలుగా కొనసాగుతున్నారు. వీరు నిర్వహించే కార్యకలాపాలను 1985 గ్రామ సమాఖ్యల్లోని 1700 మంది విలేజ్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌లు నిర్వహిస్తున్నారు. వారిని ఆయా గ్రామాల్లో బట్టి బుక్‌కీపర్లు/సంఘమిత్రలు/వీఓఏ/ యానిమేటర్లు ఇలా పలు రకాల పేర్లతో పిలుస్తారు.   వీరి శ్రమను ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారు. తాము అధికారంలోకి వస్తే నెలకు రూ.10వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీ పట్ల బుక్‌ కీపర్లు/సంఘమిత్రలు/యానిమేటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top