వయసులో చిన్న.. వెరైటీలో మిన్న..
తూర్పుగోదావరి :జగన్.. ఈ పేరు గ్రామాల్లో మార్మోగుతోంది. పెద్దలు మాత్రమే కాక చిన్నారులు సైతం ఆయనను చూడాలన్న ఆరాటంతో పాదయాత్ర బాట పడుతున్నారు. అన్నకు వెరైటీగా కనబడాలంటూ విచిత్ర వేషాలు వేసుకుని కనిపించారు గొంచాల గ్రామానికి చెందిన అభిషేక్, నవజీవన్, బాలు తదితర బాలలు. ముఖంపై వైఎస్సార్ సీపీ జెండా రంగులైన నీలం, తెలుపు, పచ్చని రంగులను అద్దుకున్నారు. తలకు వైఎస్ రాజశేఖరరెడ్డి స్టైల్లో పాగా చుట్టారు. అన్న గ్రామానికి వచ్చేస్తున్నాడంటూ వీధుల్లో సందడి చేశారు. రాగానే అన్నతో సెల్ఫీ దిగి, ఆటో గ్రాఫ్లు తీసుకున్నారు. ఆ చిన్నారుల్ని.. ‘ఓరి వీరి వేషాలో!’ అంటూ ఆశ్చర్యపోవడం పాదయాత్రలో పాల్గొన్న వారి వంతైంది.
సంబంధిత వార్తలు