ఈనాటి ముఖ్యాంశాలు

Sakshi Today news updates July 11th Aus vs Nz Semifinal

సాక్షి, హైదరాబాద్‌ : తన భర్తకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్స్ పెట్టిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల భానుమతి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబును కలిసి గురువారం ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాత ధోరణి ప్రదరిస్తూ పారిశ్రామికవేత్తలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని రైతు ఆత్మహత్యల అంశాన్ని రాహుల్‌ గురువారం లోక్‌సభలో లేవనెత్తారు. కర్ణాటక విధానసౌధ వద్ద హైడ్రామా నెలకొంది. రాజీనామా చేసిన పదిమంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం స్పీకర్‌ సురేష్‌ కుమార్‌ను కలుసుకున్నారు. స్పీకర్‌కు రాజీనామాలపై వారు వివరణ ఇచ్చారు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top