‘సాక్షి’ మెగా ఆటో షో’ అదుర్స్‌

sakshi mega auto show in Nellore - Sakshi

వేలాదిగా తరలివచ్చిన ప్రజలు

ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా ద్వారా 400 మందికి ఎల్‌ఎల్‌ఆర్‌లు

నేటితో ముగియనున్న షో

నెల్లూరు రూరల్‌:  ‘సాక్షి’ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల మెగా ఆటో షోకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, డీటీసీ శివరామ్‌ప్రసాద్‌ ఆటో షోను శనివారం ప్రారంభించారు. వివిధ కంపెనీలకు చెందిన 20 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఒక స్టాల్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా నిర్వహించగా 400 మంది యువతకు డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించి ఎల్‌ఎల్‌ఆర్‌లు పంపిణీ చేశారు. వాహనాల కొనుగోలుదారులకు ఫైనాన్స్‌ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో సిండికేట్‌ బ్యాంక్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ షో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు సాగింది. మొత్తంగా వేలాదిగా నగర ప్రజలు ప్రదర్శనలో పాల్గొని వారికి నచ్చిన వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు, బుక్‌ చేసుకున్నారు.

 తొలిరోజు వివిధ కంపెనీలకు చెందిన 8 కార్లు స్పాట్‌లో అమ్ముడు పోగా మరో 135 మంది వారికి కావాల్సిన కార్లను ఎంపిక చేసుకుని బుక్‌ చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలు 22 స్పాట్‌లో అమ్ముడు పోగా 398 వాహనాలను కొనుగోలు చేసేందుకు బుక్‌ చేసుకున్నారు. సిరికళ వెడ్డింగ్‌ మాల్‌ సౌజన్యంతో ఆటో షో సందర్శకులకు గంట గంటకు లక్కీ డిప్‌ తీసి గిప్ట్‌ కూపన్స్‌ అందజేశారు. ఈ ఆటో షోలో భార్గవి మారుతి సుజికి, భారతి నెక్సా, భార్గవి ఆటోమోబైల్, స్కోడా, కున్‌ హోండాయ్, సాయి శ్రీషిర్డిషా హోండా, సరయు హీరో, ఎంఎల్‌ విస్సా, లక్ష్మీ ప్రసన్న హోండా, లక్ష్మీప్రియ టీవీఎస్, సుజకి, రాయల్‌ ఎన్‌ఫీల్డ్, హెల్త్‌ గూడ్స్, ఎక్స్‌ప్రెస్‌ హోండా, టాటా మోటార్స్, కేటీఎం, యమహా గోల్డ్‌ ఫీల్డ్, ఏఎంరెడ్డి హీరో, ఎంజీవీ బజాజ్, తదితర కంపెనీలు పాల్గొన్నాయి. 

ఈ సందర్భంగా సాక్షి డీజీఎం బి.రంగనా«థ్‌ మాట్లాడుతూ ఈ ఆటో షోలో వాహన కొనుగోలుదారులు సౌకర్యార్థం సిండికేట్‌ బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. చివరి రోజు ఆదివారం నిర్వహించే బంపర్‌ డ్రాలో లక్ష్మీ ప్రసన్న హోండా సౌజన్యంతో గ్రాజియా బైక్‌ను అందజేస్తామన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సాక్షి  నెల్లూరు యాడ్స్‌ మేనేజర్, బ్రాంచ్‌ ఇన్‌చార్జి పి.కృష్ణప్రసాద్, బ్యూరో ఇన్‌చార్జి కె.కిషోర్, యాడ్స్‌ డిప్యూటీ మేనేజర్‌ జయరాజ్, సిండికేట్‌ బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌ దాసరి బాలకిషన్, బ్యాంక్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ వీరంద్రనాథ్‌రెడ్డి, భార్గవి ఆటో మొబైల్స్‌ అధినేత కొండా నిరంజన్‌రెడ్డి, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మారుతీ కమర్షియల్‌ వాహనాలను పరిచయం చేశాం
నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు ప్రవేశించని మారుతీ లైట్‌ కమర్షియల్‌ వాహనాలను (ఎల్‌సీవీ) ‘సాక్షి’ నిర్వహిస్తున్న మెగా ఆటో షోలో ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉంది. ఈ షోలో  ఒకే రోజు రెండు వాహనాలను వినియోగదారులు  బుక్‌ చేసుకున్నారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఈ వాహనాలు సౌకర్య వంతంగా ఉంటాయి. ఇలాంటి షోలు నిర్వహించటం వల్ల వినియోగదారులతో పాటు, కంపెనీల యాజమాన్యాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ‘సాక్షి’ మరిన్ని ఆటో షోలు ఏర్పాటు చేయాలి.
– కొండా ఈశ్వర్, మారుతీ 
కమర్షియల్‌ షోరూం, అధినేత 

ఎల్‌ఎల్‌ఆర్‌లను అందిస్తున్నాం
‘సాక్షి’ యజమాన్యం శని,ఆదివారాల్లో నగరంలోని వీఆర్సీ మైదానంలో నిర్వహిస్తున్న ఆటో షోలో 22 కంపెనీలకు చెందిన బైక్స్, కార్లలకు చెందిన పలు రకాల వాహనాలను ఒకే వేదికపై తీసుకురావటం గొప్ప పరిణామం. ఈ ఆటోషో కార్యక్రమంలో రవాణా శాఖ ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాను ఏర్పాటు చేసి పలువురికి ఎల్‌ఎల్‌ఆర్‌లు అందజేశాం. అన్ని రకాల వాహనాలను ప్రజల వద్దకే తీసుకు వచ్చిన ఈ ఆటో షో వల్ల వినియోగదారులకు ఎంతో ఉపయోగకరం.
– ఎన్‌.శివరామప్రసాద్, డీటీసీ నెల్లూరు.

 మంచి అవకాశం కల్పించారు
‘సాక్షి’ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఆటోషోలో ఏ బ్యాంక్‌కు ఇవ్వని అవకాశం మాకు కల్పించారు. వాహనాలను కొనుగోలు చేందుకు వచ్చే వారికి వాహన రుణా లను అతి తక్కువ వడ్డీకే అందిస్తున్నాం. వాహన ధరలో ఆన్‌రోడ్డుపై 85 శాతం నగదును రుణంగా  మా ఖాతాదారులకు తక్షణమే అందించటంతో పాటు, క్రెడిట్‌ కార్డును అందిస్తున్నాం. నూతన ఖాతాదారులకు కూడా వాహన రుణాలను 3 రోజుల్లో పూర్తి చేసి ఇస్తున్నాం.  
 – దాసరి బాలకిషన్‌ రీజనల్‌ మేనేజరు,
 సిండికేట్‌ బ్యాంకు 

షోరూంనే తరలించాం
నగరంలోని ఎంజీ బ్రదర్స్‌ షోరూం లో ఉన్న బజాజ్‌ కంపెనీకు చెందిన అన్ని రకాల మోడల్స్‌ బైక్‌లను ‘సాక్షి’ నిర్వహిస్తున్న మెగా ఆటోషోకు  షోరూనే తరలించి వినియోగదారులకు అందుబాటులో ఉంచాం.
మా వద్ద ఉన్న  100 సీసీ నుంచి 400 సీసీ వరకు బైక్‌లు రూ.32 వేల నుంచి రూ.1.80 లక్షల ధరల్లో అన్నిరకాల వాహనాలను ప్రజల సందర్శనకు ఉంచాం. మంచి స్పందన వస్తోంది. పలు వాహనాలు అమ్మకాలు సాగించాం.
– కె.సాయిప్రదీప్, సేల్స్‌ మేనేజరు, 
ఎంజీ బ్రదర్స్‌ షోరూం 

అన్ని కంపెనీలు ఒకే దగ్గరకు వచ్చాయి
నెల్లూరు నగరంలోని అన్ని కంపెనీ లకు చెందిన ద్విచక్ర వాహనాల షోరూంలు ఒకే దగ్గరకు ‘సాక్షి’ తీసుకురావడంతో  వినియోగదారులకు సమ యం కలిసి వస్తుంది. వారికి కావాల్సిన మోడల్స్‌లను ఎంపిక చేసుకుని టెస్ట్‌ డ్రైవ్‌ చేసుకుని సంతృప్తి చెందాకే వాహనాలను కొంటున్నారు. ఇప్పటికే పలు వాహనాలు అమ్మకాలు జరిగాయి.« రెండేళ్ల నుంచి ‘సాక్షి’ యాజమాన్యం ఇలాంటి షోలు నిర్వహిస్తూ, మన్ననలను పొందుతున్నారు.  
– పి.బాలసుబ్రహ్మణ్యం, మేనేజరు, 
ఏఎంరెడ్డి ఆటో ఏజెన్సీస్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top