పంచగ్రామాల సమస్య పరిష్కార బాధ్యత పీఠాధిపతులకే..

Sabbavaram Public Meeting Success In Praja Sankalpa Yatra - Sakshi

వాళ్లకు తోడుగా ఉండి న్యాయం జరిగేలా చూస్తా

ఎన్టీపీసీ కాలుష్యం బాధిత మూడు గ్రామాలను తరలిస్తాం..

బాధితులకు పరిహారం అందేలా చూస్తాం

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం

సబ్బవరం సభలో వైఎస్‌ జగన్‌ హామీల వర్షం

సాక్షి, విశాఖపట్నం : ‘ఆ దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇక్కడి పిల్లలు బాగుండాలని ఆరాటపడ్డారు. ఆయన చేసిన కృషి వల్ల అటువైపు చూస్తే అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్, ఇటువైపు పరవాడలో ఫార్మా సిటీ కన్పిస్తాయి. బ్రాండిక్స్‌లో 18 వేల మంది పనిచేస్తున్నారు. ఎస్‌ఈజెడ్‌లో 25 వేల మందికి ఉద్యోగాలు వస్తున్న పరిస్థితి. ఫార్మసిటీలో 12వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇకపోతే పక్కనే దామోదరం సంజీవయ్య లా యూ నివర్సిటీ.. ఆనాడు దేశవ్యాప్తంగా 16 యూనివర్సిటీలుంటే మన రాష్ట్రానికి కూడా లా యూనివర్శిటీ కావాలని పట్టుబట్టి తీసుకొచ్చి సబ్బవరంలో పెట్టించారు. 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజలు తాగునీరు అందించే లక్ష్యంతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శంకుస్థాపన చేశారు. ఆ మహానేత హయాంలో పాలన ఇలా ఉంటే నేడు ప్రతిదీ స్కామేనని, ఈ స్కాముల్లో ఎమ్మెల్యేలకింత.. కలెక్టర్లకింత.. చినబాబుకింత... పెదబాబుకింతా అని పంచుకు తింటున్నారు. పెదబాబు పర్మిషన్‌ ఇస్తాడు.. చినబాబు కలెక్షన్‌ చేస్తాడంటూ’ జన నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సబ్బవరం బహిరంగ సభలో తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.

పంచగ్రామాల సమస్య చంద్రబాబు పుణ్యమే
బుధవారం సబ్బవరంలో జరిగిన భారీ బహిరంగ సభలో జననేత వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తూ స్థానిక టీడీపీ నేతల భూ ఆక్రమణలు, దందాలు, దోపిడీపై తనదైన రీతిలో మాటల తూటాలు పేల్చా రు. పరిష్కరించాలన్న తపన.. చిత్తశుద్ధి చంద్రబాబుకు లేకపోవడం వలనే సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారానికి నోచుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. విశాఖలో జరిగిన తొలి కేబినెట్‌ మీటింగ్‌లో 100 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారిస్తానంటూ మనందరి చెవుల్లో పువ్వులు పెట్టారని విమర్శించారు. వంద రోజుల్లో పరిష్కరిస్తానన్న ఈ సమస్య మరో 100 రోజుల్లో ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉన్నా పరిష్కరించకపోవడం చూస్తుంటే ప్రజల మనోభావాలతో ఏ స్థాయిలో ఆడుకుంటున్నారో అర్ధమవుతుందన్నారు. ఇదే నియోజక వర్గంలో ఉన్న పీఠాధిపతుల దగ్గరకు వెళ్లి ఈ బాధ్యతను వారిపై పెట్టి వారికి తోడుగా ఉంటే ఈ సమస్య పరిష్కా రం కాదా అని ఆయన ప్రశ్నించారు. మీ అందరి ఆశీస్సులు, ఆ సింహాచలం దేవుని ఆశీçస్సులతో మన పార్టీ అధికారంలోకి రాగానే ఈ సమస్య పరిష్కరించే బాధ్యతను పీఠాధిపతులకు అప్పజెప్పి వాళ్లకు తోడుగా ఉంటానన్నారు.

ఆ మూడు గ్రామాలను షిఫ్ట్‌ చేస్తా..
ఎన్టీపీసీ ఫ్లైయా‹ష్‌పాండ్‌ కాలుష్యం బారిన పడిన పిట్టవానిపాలెం, దేవాడ, మరణాసి పేటగ్రామాలను చంద్రబాబు పట్టించుకోలేదని, మన ప్రభుత్వం రాగానే ఈ మూడు గ్రామాలను షిప్ట్‌ చేయడమే కాదు వాళ్లందరికి కావల్సిన పరిహారం కూ డా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఉన్న పరిశ్రమలు.. కట్టబోయే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు లోకల్‌ వాళ్లకే ఇవ్వాలని అధికారంలోకి రాగానే తొలి సమావేశాల్లోనే చట్టం తీసుకొస్తానన్నారు.

గజానికో కబ్జాకోరు..
విశాఖపట్నంలో భూములపై చంద్రబాబు కన్ను పడిందన్నా అని ఇక్కడ ప్రజలు నా దగ్గరకు వచ్చి చెబుతా ఉంటే ఆందోళన కలుగుతోందన్నారు. దళిత మహిళను ఏకంగా బట్టలు ఊడదీసి దాడి చేసిన ఘటన గురించి వింటే చాలా బాధగా ఉందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

ముదపాక భూములకు ఎసరు
పేదవారికి ఎసైన్‌ చేసిన 540 ఎకరాలు ముదపాక భూములు కొట్టేయడానికి ఇక్కడ టీడీపీ నాయకులు ఏకంగా చినబాబుతో కలిసి చేసిన చేసిన స్కామ్‌ ఇంతా అంతా కాదని వైఎస్‌ జగన్‌ విమర్శించినప్పుడు సభకు తరలి వచ్చిన ముదపాక రైతులు çహర్షధ్వానాలు చేశారు. పెదగంట్యాడలో మెడ్‌టెక్‌ కోసం పేదలు, మాజీ సైనికులకు చెందిన 250 ఎకరాల భూములు బలవంతంగా తీసుకున్నారని, పరిహారం కోసం టీడీపీ నేతలు బినామీలను సృష్టించి డాక్యుమెంట్లు తారుమారు చేసారని ఆరోపించారు. గుర్రంపాలెంలో రైతుల నుంచి డి.ఫారం భూములు సేకరించిన ఏపీఐఐసీ ఎకరాకు 25లక్షల చొప్పున పరిహారం ఇవ్వగా, బినామీలను సృష్టించి, రికార్డులు తారుమారు చేసి ఆ పరిహారాన్ని కూడా దోచుకుతినే కార్యక్రమాన్ని చేశారని ధ్వజమెత్తారు.

నీరు చెట్టులోనూ దోపిడీ
పినగాడిరాతి చెరువు, పెందుర్తి పెద్దచెరువు, జవ్వాదిపాలెం చెరువుతో సహా అనేక చెరువులను తవ్వేసి నీరు చెట్టు పథకం కింద మట్టిని అమ్ముకోవడమే కాదు బిల్లులు కూడా చేసుకున్నారని జననేత విమర్శించారు. లక్ష్మిపురంలో రాయుడు చెరువును ఆక్రమించి 100 కోట్ల విలువైన భూమిని కాజేయడానికి ప్లాన్‌ చేసారంటే టీడీపీ నాయకులున్నది ప్రజలు మేలు చేయడానికా? దోచుకోడానికా? అని ఆయన ప్రశ్నించారు.  

చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలి : బహిరంగ సభలో అమర్‌నాథ్, వరుదు కల్యాణి
పెందుర్తి నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న అవినీతిని, అరాచకాలను అంతమొందించాలని, దీనికోసం నడుం బిగించి పాదయాత్ర ద్వారా మనందరి ఆశీస్సుల కోసం వస్తున్న జగనన్నకు అండగా నిలవాలని అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ పిలుపునిచ్చారు. ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాలంటే జగన్‌ను సీఎం చేయాలన్నారు. రాబోయే ఎన్నికలు వంచనకు విశ్వసనీయతకు మధ్య జరుగుతున్నాయన్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి మాట్లాడుతూ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చేసే అవినీతి అక్రమాలకు చరమగీతం పాడాలన్నారు. ఈ నియోజకవర్గంలో ఒక దళిత మహిళను వివస్త్రను చేసి కొడితే చంద్రబాబు ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

తండ్రి శాంక్షన్‌.. కొడుకు కలెక్షన్‌ : ఎమ్మెల్యే అవినీతి బండారంపై అదీప్‌రాజ్‌ నిప్పులు
పెందుర్తి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అతని కొడుకు అప్పలనాయుడు దోచుకుతింటున్నారని, పథకాలను తండ్రి శాంక్షన్‌ చేస్తే కొడుకు లబ్ధిదారుల నుంచి కమీషన్లు కలెక్షన్‌ చేస్తున్నారని పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌  మండి పడ్డారు. కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోయినా పంచ గ్రామాల సమస్యలు పరిష్కరించకపోయినా హిందూజా, ఎన్‌టిసీపి పవర్‌ప్లాంట్ల నుంచి వస్తున్న కాలుష్య సమస్యలు పరిష్కరించకపోయినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారని, ఈ సమస్యల  పరిష్కారం కోసం ఆయన ఎప్పుడూ పోరాటంగాని, రాజీనామాగాని చేయలేదన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు అలిగి గన్‌మేన్‌లను వెనక్కి పంపించి బండారు చంద్రబాబును బ్లాక్‌ మెయిల్‌ చేశారన్నారు. ప్రభు త్వ భూములను ఇçష్టానుసారం కబ్బా చేసి తమ పేరున రికార్డుల్లో నమోదు చేయించుకుంటున్నారని ఆరోపించారు. జెర్రిపోతుల పాలెంలో దళిత మహిళ ను వివస్త్రను చేసిన కొట్టిన ఘటన బండారు కొడుకు అప్పలనాయుడు సమక్షంలోనే జరిగిందన్నారు. ఘటనకు 10 నిమిషాల ముందు అప్పలనాయుడు అక్క డే ఉన్నారన్నారు. తన కొడుకు లేడని నిరూపించగలరా అని సవాల్‌ విసిరారు. 

మరిన్ని వార్తలు

11-01-2019
Jan 11, 2019, 17:05 IST
సాక్షి, కడప: సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని కడప జిల్లాకు చేరుకున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
11-01-2019
Jan 11, 2019, 16:19 IST
చంద్రబాబు చర్మం దొడ్డైంది.. ధర్నాలు, రాస్తారోకోలతో చదువును పాడు చేసుకోవద్దు..
11-01-2019
Jan 11, 2019, 15:00 IST
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు,...
11-01-2019
Jan 11, 2019, 06:46 IST
ఎండమావిలో పన్నీటి జల్లులా...కష్టాల కడలిలో చుక్కానిలా ఇపుడుకొండంత అండ దొరికినట్టయింది.ఒక్కో పథకం ఒక్కో రత్నంలా జనంమోములో వెలుగునింపుతోంది.జననేత ఇచ్చిన భరోసాతోప్రతిఒక్కరిలో...
10-01-2019
Jan 10, 2019, 16:52 IST
సాక్షి, తిరుపతి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌  అలిపిరి నుంచి...
10-01-2019
Jan 10, 2019, 15:52 IST
సాక్షి, విజయవాడ : ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభను చూసి టీడీపీ నేతలకు చెమటలు పడుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల...
10-01-2019
Jan 10, 2019, 15:29 IST
సాక్షి, తిరుపతి: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించిన...
10-01-2019
Jan 10, 2019, 09:21 IST
బిందువు.. బిందువూ కలిసి సింధువైనట్లు.. అడుగు.. అడుగు కలిసి అభిమాన సంద్రమైంది. 14 నెలలు.. 3648 కిలోమీటర్లు.. అలుపెరగని బాటసారి...
10-01-2019
Jan 10, 2019, 08:51 IST
కాకినాడ: ప్రజా సంకల్ప పాదయాత్ర తుది అంకంలో ‘మేముసైతం’... అంటూ జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద...
10-01-2019
Jan 10, 2019, 08:28 IST
కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని... ప్రతి పేదవాడి గుండెల్లో బాధను నేరుగా తెలుసుకోవాలని... పద్నాలుగు నెలల క్రితం ప్రతిపక్షనేత,...
10-01-2019
Jan 10, 2019, 08:21 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నేల ఈనిందా అన్నట్లు ఇచ్ఛాపురం కదం తొక్కింది. రాష్ట్ర ప్రజల్లో ప్రస్తుత చంద్రబాబు పాలనపై ఉన్న...
10-01-2019
Jan 10, 2019, 07:59 IST
శ్రీకాకుళం :పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎనలేని ప్రజాదరణ వచ్చింది. ప్రజల సమస్యలు తెలుసుకునే వారే నిజమైన నాయకులు. అలా.. జనంలో...
10-01-2019
Jan 10, 2019, 07:50 IST
శ్రీకాకుళం :గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. ప్రజా సంకల్పయాత్ర  చేపట్టి ప్రజల బాధలు, కష్టాలు తెలుసుకోవాలన్న సంకల్పం ఎంతో మంచిది....
10-01-2019
Jan 10, 2019, 07:47 IST
శ్రీకాకుళం :ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన పాదయాత్రలో జన హృదయాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుచుకున్నారు. బడగు, బలహీన వర్గాలు...
10-01-2019
Jan 10, 2019, 07:45 IST
శ్రీకాకుళం :దివ్యాంగులను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. అంగవైకల్యంతో బాధపడుతున్నాను. పెన్షన్‌కు దరఖాస్తు చేసినా జన్మభూమి కమిటీలు తొలగించాయి. హిందీ బీఈడీ...
10-01-2019
Jan 10, 2019, 07:35 IST
శ్రీకాకుళం :క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. ముంబైలో ఆపరేషన్‌ కూడా చేశారు. మళ్లీ ఆపరేషన్‌ చేయాలని చెబుతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మా...
10-01-2019
Jan 10, 2019, 07:32 IST
శ్రీకాకుళం :పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల ముందుకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్న నాయకుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర...
10-01-2019
Jan 10, 2019, 07:30 IST
శ్రీకాకుళం :దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాడు అందించిన రామరాజ్యాన్ని నేడు తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తాడన్నది ప్రజాసంకల్పయాత్ర ద్వారా...
10-01-2019
Jan 10, 2019, 07:27 IST
శ్రీకాకుళం :రాజధాని భూములిస్తే మూడున్నరేళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినా కార్యరూపం దాల్చలేదు. నాలుగున్నరేళ్లు...
10-01-2019
Jan 10, 2019, 07:21 IST
శ్రీకాకుళం : ధర్మపురం గ్రామంలో సాగునీటి కాలువను అభివృద్ధి చేయాలి. 2000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువ పనులు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top