జై కొట్టిన సబ్బవరం

Sabbavaram People Support to YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

ప్రజా సంకల్పయాత్ర @ 2900 కిలోమీటర్లు

మరో మైలురాయి దాటిన జగన్‌

అలుపెరుగని బాటసారికి అపూర్వ స్వాగతం

పచ్చ తివాచీ.. పూలవర్షం కురిపించిన అభిమానులు

సాక్షి, విశాఖపట్నం ,పాదయాత్ర ప్రత్యేక బృందం: అలుపెలుగని పాదయాత్రికుడు మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత యలమంచిలి నియోజకవర్గంలో 2,800 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తాజాగా పెందుర్తి నియోజకవర్గంలో 2,900 కిలోమీటర్ల పాదయాత్ర దాటి ముందుకు సాగారు. ప్రజా సంకల్పయాత్రలో జననేత అడుగిడిన ఆ పల్లెలకు పండగ వచ్చింది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కళా బృందా ల డప్పుల మోతలతో పాదయాత్ర జరిగిన గ్రా మాల్లో పెద్ద సంబరమే జరిగింది. తమ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిన జననేతకు అడుగడునా జనం పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.

ప్రజాసంకల్ప పాదయాత్ర 255వ రోజు విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో సాగింది. రాత్రి బసచేసిన గుల్లేపళ్లి నుంచి బుధవారం ఉదయం 8.40 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర గుల్లేపళ్లి, రావలమ్మపాలెం, సబ్బవరం, సూర్రెడ్డిపాలెం మీదుగా అమృతపురం వరకు సాగింది. పెదనాయుడపాలెం పాతరోడ్డు వద్దకు చేరుకోగానే 2,900 మైలురాయి దాటడంతో అక్కడ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొక్క నాటి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించారు. ఆయన అడుగులో అడుగు వేస్తూ వేలాది మంది చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా నడిచారు. మహిళలు హారతులిచ్చి స్వాగతం పలకగా.. దారిపొడవునా పువ్వులు చల్లి.. పచ్చని తివాచీలు పరిచి బహుదూరపు బాటసారి కాళ్లు కందకుండా ఆయా గ్రామాల ప్రజలు తమ ప్రేమానురాగాలను, అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు యువకులు బైక్‌ ర్యాలీలతో హోరెత్తించగా విద్యార్థులు, మహిళలు, యువత జగనన్నతో కలసి అడుగులో అడుగువేసి జైజై జగన్‌ నినాదాలు చేశారు. అన్నా నువ్వు సీఎం కావాలంటూ జిందాబాద్‌ కొట్టారు. వృద్ధులంతా రాజన్న బిడ్డని చూసి మురిసిపోయి తమ చల్లని దీవెనలు ఇస్తూ ఆశీర్వదించారు. ఓ చిన్నారికి అన్న ప్రాసన చేసిన జగన్‌ పాదయాత్ర పొడవునా తనను కలసిన వారి సమస్యలు వింటూ ముందు కు సాగారు. రైతులు, నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, రోజుకూలీలు, విద్యార్థులు చెప్పుకు న్న గోడు వింటూ నేనున్నానే భరోసా ఇస్తూ త్వరలో మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం వస్తుందని, కష్టాలన్నీ తీరుస్తామంటూ హామీ ఇచ్చారు.

భోజనం విరామం తర్వాత ఆదిరెడ్డిపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వేలాది మంది అభిమానులు వెంటరాగా సాయంత్రం 4 గంటలకు సబ్బవరం మూడు రోడ్ల జంక్షన్‌లో భారీ బహిరంగం సభకు చేరుకున్నారు. ఈ సభలో జననేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి స్థానిక సమస్యలతోపాటు చంద్రబాబు పాలనను ఎండగట్టారు. స్థానిక సమస్యలనే ఎక్కువగా ప్రస్తావించడంతో నియోజకవర్గ ప్రజల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. పంచ గ్రామాల సమస్య, హిందూజా, ఎన్టీపీసీ పవర్‌ ప్లాంట్‌ల నుంచి వచ్చే కాలుష్య సమస్యలతోపాటు ముదపాక భూ సమస్యను స్థానికులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని జగన్‌ హామీ ఇవ్వడంతో వారికి కొండంత భరోసా లభించింది.

ప్రజా సంకల్పయాత్రలో బుధవారం రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, పాదయాత్ర టూర్‌ ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, శాసనసభాపక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి పి.సాంబశివరాజు, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.వి.సత్యనారాయణ, శిల్పా రవిచంద్రారెడ్డి, సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర గణేష్, తిప్పల నాగిరెడ్డి, కె.కె.రాజు, ఎం.వి.రమణమూర్తి రాజు, హఫీజ్‌ఖాన్, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాలరెడ్డి, బొత్స అప్పలనాయుడు, కుంభా రవిబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, సీఈసీ సభ్యులు కాకర్లపూడి శ్రీకాంత్, పైల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు దంతులూరి దిలీప్‌కుమార్, తాడి విజయభాస్కరరెడ్డి, రొంగలి జగన్నాథం, రాష్ట్ర అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, రవిరెడ్డి, బైలపూడి భగవాన్, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, రాష్ట్ర యూత్‌ ప్రధాన కార్యదర్శి గుడ్ల పోలిరెడ్డి, రూరల్, రాష్ట్ర మాజీ మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష, అరకు పార్లమెంట్‌ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు తడబారిక సురేష్, నగర మహిళా అధ్యక్షులు పీలా మçహాలక్ష్మి, గరికిన గౌరి, జిల్లా నాయకులు చొక్కాకుల వెంకటరావు, జి.కిరణ్‌రాజు, ఎం.వి.వి.కుమార్, పీలా ఉమారాణి, బోకం శ్రీనివాస్, పైల ముత్యాలనాయుడు, ముమ్మన వెంకటరమణ, ఎల్‌.బి.నాయుడు, దాసరి రాజు, ఇసరపు గోవింద్, కోన సంజీవరావు, బోకం రామునాయుడు, తుంపాల అప్పారావు, గెడ్డం ఉమ, చిరికి దేవుడు, సబ్బవరపు నారాయణమూర్తి, దేవుడుబాబు, లాలం ముత్యాలనాయుడు, చిటికెరెడ్డి వినోద్‌కుమార్, కొటాన కోటయ్య, కొటాన రాము, సిరిపురపు అప్పలనాయుడు, చుక్క రామునాయుడు, చింతల ఎర్రయ్య, ఇప్పిలి లోలాక్షి, కృష్ణారావు, బైలపూడి దేవుడు, యతిరాజుల నాగేశ్వరరావు, వడ్డాది అప్పలరాజు, పెదిరెడ్డి శేఖర్, ఇల్లపు ప్రసాద్, చల్లా సోమునాయుడు, మచ్చ కోటేశ్వరరావు, చిప్పల చందు, ఐటీ విభాగం విశాఖ కన్వీనర్‌ పూర్ణ, ఇచ్ఛాపురం నుంచి అందాల విక్రమ్, అనంతపురం నుంచి చెవ్వా రాజశేఖరరెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

ముదపాక భూములు దోచేస్తున్నారయ్యా..
ముదపాకలో 950 ఎకరాల అసైన్డ్‌ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట టీడీపీ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోంది. అడ్వాన్స్‌ కింద రూ.లక్ష ఇచ్చి పట్టాలు లాగేసుకున్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయన తనయుడు అప్పలనాయుడు బాధితులమైన మాపైనే తప్పుడు కేసులు బనాయించి తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారు. మాకు జరిగిన అన్యాయాన్ని బాధిత సంఘం అధ్యక్షుడు గణేష్‌ ఆధ్వర్యంలో గుల్లేపళ్లి వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి వివరించాం. మన ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  – ముదపాక బాధిత రైతులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top