మాయలేడి నుంచి సొమ్ము రికవరీ

robbery money recovery from cheating woman and gang

పశ్చిమగోదావరి , వేలేరుపాడు :  కన్న తండ్రికి మాయమాటలు చెప్పి ఏటీఎం కార్డు ద్వారా లక్షలాది రూపాయలు కాజేసిన సొమ్మును మాయలేడీ నుం చి శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతనెల 25న ‘నాన్నా అంటూ వచ్చి.. నట్టేట ముంచి..’ శీర్షికతో ‘సాక్షి’ లో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట సీఐ రవికుమార్‌ సొమ్మును రికవరీ చేశారు. అశ్వారావుపేట పోలీసు స్టేషన్‌లో బాధితుడు కొర్సా రాజులు చేసిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదైంది. నిందితులు అనిత, బాషా, రామును పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజుల ఖాతా నుంచి కాజేసిన రూ.7.30 లక్షల్లో రూ.2 లక్షల విలువైన బంగారం, రూ.3 లక్షల వరకు నగదును పోలీసులు రికవరీ చేసి నిందితులను రిమాండ్‌కు పంపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top