ఇంటర్నెట్‌ నుంచే రేషన్‌కార్డు

Ration card from the Internet

నెల్లూరు(క్రైమ్‌): రేషన్‌కార్డు పోయిందా? కొత్త రేషన్‌కార్డు దరఖాస్తు చేసుకున్నారా? మీరు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంటే చాలు ఇంట్లో నుంచే వాటిని సులభంగా పొందవచ్చు. గతంలో తెల్లకార్డు/గులాబి కార్డును పొందిన కుటుంబాలు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల వివరాలు ఏ విధంగా నమోదు/తొలగించాలనే వివరాలు మీకోసం.  

రేషన్‌కార్డుతోనే గుర్తింపు  
ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు విషయం లేదా ఏ ఇతర సందర్భాల్లో మీతో పాటు మీ కుటుంబ సభ్యుల గుర్తింపు వివరాలు అందించాల్సిన సందర్భంలో రేషన్‌కార్డునే పొందు పరచాల్సి ఉంటుంది. దీంతో మీ కుటుంబ సభ్యుల వివరాల్లో ఏమైనా మార్పులుంటే తప్పని సరిగా కార్డులో నమోదు చేసుకోవాలి. దారిద్య్రరేఖకు దిగున ఉన్న వారికి ఆహార భద్రత నిమిత్తం ఇచ్చే తెలుపు రంగు రేషన్‌కార్డు వినియోగదారులు వారి డీలర్‌ వద్ద సరుకులు పొందే అవసరాల నిమిత్తం ఎప్పటికప్పుడు వారి రేషన్‌కార్డులను మార్పు చేసుకుంటారు. అయితే ఈ రేఖకు ఎగువన ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వ్యాపారులు పింక్‌ రంగు కార్డుల విషయంలో ఏళ్ల తరబడి అలానే ఉండిపోతారు. వారు కుటుంబ సభ్యుల గుర్తింపు కోసం రేషన్‌ కార్డులో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

కార్డు వివరాలు పొందడం ఇలా   
 రేషన్‌కార్డుల వివరాల కోసం ఆంధ్రప్రదేశ్‌ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందుకోసం ఠీఠీఠీ. ్ఛpఛీట్చp.్చ p.జౌఠి.జీn అనే వెబ్‌సైట్‌ లాగిన్‌ అవ్వాలి.

స్క్రీన్‌ మీద కనిపించే వెబ్‌సైట్‌ ముఖచిత్రంలో కింద కాలమ్‌లో ప్రింట్‌రేషన్‌కార్డు, సెర్చ్‌ రేషన్‌కార్డు, ట్రాన్షాక్షన్‌ హిస్టరీ, అప్లికేషన్‌ సెర్చ్‌ అనే నాలుగు కాలమ్స్‌ కనిపిస్తాయి. వాటిలో మీ రేషన్‌కార్డు నంబర్‌ నమోదు చేయాలి.

రేషన్‌కార్డు నంబర్‌ లేకపోతే ఆధార్‌కార్డు  (గతంలో మీ కార్డ్‌ ఆధార్‌ సంఖ్యకు అనుసంధానం అయినప్పుడు మాత్రమే)నంబర్‌ నమోదు చేసుకుని డూప్లికేట్‌ కార్డు పొందచ్చు.

ప్రింట్‌ రేషన్‌కార్డు
ఈ కాలమ్‌ క్లిక్‌ చేయడం వల్ల రేషన్‌కార్డుపై గతంలో మీరు ఇచ్చిన వివరాలతో డూప్లికేట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది.  

సెర్చ్‌ రేషన్‌కార్డు
ఈ కాలమ్‌లో మీ కార్డు వివరాలు, కుటుంబ సభ్యుల సంఖ్య తదితర వివరాలు మీకు డిస్‌ప్లే రూపంలో కనిపిస్తాయి.   

ట్రాన్షాక్షన్‌ హిస్టరీ  
కార్డు ద్వారా డీలర్‌ నుంచి తీసుకొన్న నెల వారీ సరుకుల లావాదేవీల వివరాలు పొందవచ్చు.

అప్లికేషన్‌ సెర్చ్‌  
కొత్త రేషన్‌కార్డు గురించి దరఖాస్తు చేసుకుంటే మీ సేవలో మీకు కేటాయించిన దరఖాస్తు సంఖ్య నమోదు చేసి దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు.  

కార్డు కేటగిరీలు  
రేషన్‌కార్డు సంఖ్యలో మొదటి మూడు ఆంగ్ల అక్షరా లు ఆధారంగా కార్డు కేటగిరీని తెలుసుకోవ చ్చు. గతంలో మీరు తీసుకున్న తెలుపు, గులాబి రంగుల రేషన్‌కార్డులు సైతం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పసుపు రంగులో ఉన్నాయి.

మీ సేవ నుంచి కూడా..  
2006లో గులాబి రంగు కార్డు పొందిన కుటుంబం నాటి నుంచి ఆ కార్డులో ఎటువంటి మార్పులు చేయకపోతే ఆ కార్డు నంబర్‌ను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే 2006లో ఇచ్చిన వివరాలతో కార్డు వస్తుంది. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలు, మండలాల్లోని మీ సేవ కేంద్రం నుంచి కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డు, పిల్లల పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాల నకలతో దరఖాస్తు చేసుకోవాలి. రూ. 5 దరఖాస్తుకు, రూ.35 సేవా రుసుం కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ వివరాలు పరిశీలించి కార్డులో నమోదు చేసి మీకు కొత్త కార్డును అధికారులు అందిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top