కష్టకాలంలో.. కొండంత అండగా..

Political Leaders Distributing Food in Guntur - Sakshi

వైఎస్సార్‌సీపీ నాయకుల దాతృత్వం

భోజన, కూరగాయల ప్యాకెట్లు, మంచినీటి బాటిళ్లు అందజేత

నరసరావుపేట: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో రోడ్లపై ఆకలితో అలమటించే పేదలు, నిరాశ్రయులు, యాచకులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. సోమవారం 12వ వార్డు నాయకుడు సానికొమ్ము కోటిరెడ్డి నాయకత్వంలో మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బందికి ఉచితంగా కూరగాయల ప్యాకెట్లను లీగల్‌ మెట్రాలజీ జిల్లా ఇన్‌స్పెక్టర్‌ చల్లా దయాకరరెడ్డి అందజేశారు. ఆ వార్డు మాజీ కౌన్సిలర్‌ నేలటూరి మురళీ సహకారం అందించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు మద్దిరెడ్డి నరసింహారెడ్డి, మారూరి లింగారెడ్డి నేతృత్వంలో పేదలకు భోజన ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లను ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఓరుగంటి శేషిరెడ్డి, లీగల్‌ మెట్రాలజీ జిల్లా ఇన్‌స్పెక్టర్‌ చల్లా దయాకరరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై అందజేశారు. ఎం.ఐ.ఎం నాయకులు లాల్‌బహుదూర్‌ కూరగాయల మార్కెట్‌ సెంటర్‌లో చేపట్టిన భోజన ప్యాకెట్లు, వాటర్‌ ప్యాకెట్ల పంపిణీకి మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఎస్‌.ఏ.హనీఫ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి పంపిణీ చేశారు. ఎం.ఐ.ఎం నాయకులు మస్తాన్‌వలి, రియాజ్, మౌలాలి, వైఎస్సార్‌సీపీ నాయకులు షేక్‌.ఖాదరభాషా, కరిముల్లా, జక్రియా భాయ్‌ పాల్గొన్నారు. బీజేపీ నాయకులు రాజీవ్‌ గృహకల్పలో నివాసం ఉండే రోజువారీ కూలీపనులు చేసే కూలీలు, దీర్ఘకాలి వ్యాధి గ్రస్తులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. 

పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో..
మాచర్ల: పట్టణానికి చెందిన వాసవి క్లబ్‌ సభ్యులు తిరివీధి వెంకట నాగేశ్వరరావు దాతలు కొత్తమాసు మోహన్‌రావు, కట్టమూరి శివ, విడేల లక్ష్మీనారాయణల ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పులిహోర, దద్దోజనం, మంచినీరు పంపిణీ చేశారు. సభ్యులు చిన్ని శ్రీను పాల్గొన్నారు. 

రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో..  
పట్టణంలోని రామకృష్ణ సేవా సమితికి చెందిన మధ్యాంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులకు ప్రభుత్వాసుపత్రి రోగులు, జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలొని అనాథలు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించే సిబ్బందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం ప్యాకెట్లు సరఫరా చేశారు. పట్టణానికి చెందిన పత్తిఫ్యాక్టరీ షిర్డీ, సత్యసాయి దేవాలయ అధ్యక్షులు కొత్తమాసు వీరాంజనేయులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన పంపిణీ చేశారు. 

శావల్యాపురంలో..  
శావల్యాపురం: సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని బొందిలిపాలెం, శావల్యాపురం, కృష్ణాపురం, తదితర గ్రామాల్లో పేదలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసినట్లు సీపీఎం మండల కార్యదర్శి కేవీఆర్‌ మోహన్‌చందు సోమవారం తెలిపారు. సీపీఎం నాయకులు ముండ్రు కోటయ్య, బత్తుల వెంకటేశ్వర్లు, బోయపాటి వెంకటరాయుడు, భవనగిరి వెంకటేశ్వర్లు ఉన్నారు. 

500 మందికిపైగా ఉచిత భోజనం
దాచేపల్లి: విధుల్లో ఉన్న పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సూచనల మేరకు సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, పాదచారులకు సోమవారం నుంచి ఉచితంగా భోజనం ఏర్పాటు చేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. పొందుగల వద్ద 250 మంది, తంగెడ వద్ద 100కిపైగా పోలీసులు విధులు నిర్వహిస్తుండగా ఈ రెండు సరిహద్దుల వద్ద మరో 50 మందికిపైగా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటుగా తెలంగాణ నుంచి ఆంధ్రలోకి ఆంధ్ర నుంచి తెలంగాణలోకి వెళ్లేందుకు మరో 100కిపైగా పాదచారులు ప్రతి రోజూ వస్తున్నారు. వీరిని పోలీసులు అడ్డుకోవటంతో వైఎస్సార్‌సీపీ నాయకులు గుర్తించి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ మండల కన్వీనర్‌ షేక్‌ జాకీర్‌ హుస్సేన్, మాజీ జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, మాజీ సర్పంచి మందపాటి రమేష్‌రెడ్డి, ఎంపీటీసీ ఆకూరి కాశీరెడ్డి, తండా అబ్దుల్‌ సత్తార్, నాయకులు కూసం నాగిరెడ్డి, వణుకూరి రామకృష్ణారెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు, నాళం శ్రీనివాసరావు, తండా బుడేసా, తండా అజీజ్, ఆవుల సైదులు, ఆరికట్ల మల్లారెడ్డి తదితరులు పోలీసులు, పాదచారులకు భోజనం వడ్డించారు. రిహద్దుల్లో రాకపోకలు సాగించేంత వరకు వైఎస్సార్‌సీపీ ద్వారా భోజనం ఏర్పాట్లు చేస్తామని కన్వీనర్‌ జాకీర్‌హుస్సేన్‌ చెప్పారు. 

లింగంగుంట్ల గ్రామంలో..
నరసరావుపేట రూరల్‌:  లింగంగుంట్ల గ్రామంలోని  పేద ప్రజలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సోమవారం కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈ పంపిణీని చేపట్టారు. డాక్టర్‌ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కామిరెడ్డి నర్సిరెడ్డి, యన్నం రవీంద్రారెడ్డి, కామిరెడ్డి నాగిరెడ్డి, కటకం బ్రహ్మనందరెడ్డి, నంద్యాల దామోదరరెడ్డి, కామిరెడ్డి సుధాకరరెడ్డి, పొన్నపాటి లక్షా్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఉప్పలపాడులో...
ఉప్పలపాడులో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆదివారం రాత్రి కూరగాయలు పంపిణీ చేశారు. వైఎస్సార్‌ సీపీ గ్రామ నాయకులు యన్నం వెంకటనర్సిరెడ్డి, యన్నం రాధాకృష్టారెడ్డి, శనివారపు పెదనారపరెడ్డి, యేసిరెడ్డి సుబ్బారెడ్డి, సాగిరెడ్డి అంజిరెడ్డి, శనివారపు సుబ్బారెడ్డి, కనకా పుల్లారెడ్డి, నంద్యాల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెంటచింతలలో..
రెంటచింతల: వృద్ధులు, అనాథలకు అన్నదానం చేస్తే భగవంతునికి చేసినట్లేనని ఎంపీడీవో గంటా శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు పల్లెర్ల లక్ష్మారెడ్డి తండ్రి వర్ధంతి సందర్భంగా సోమవారం కరోనా వైరస్‌ వలన అన్నం కోసం ఇబ్బంది పడుతున్న పలువురు వృద్ధులకు, అనాథలతో పాటు పోలీసు, రెవిన్యూ, ఆరోగ్య, మండల పరిషత్‌ కార్యాలయంలోని ఉద్యోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు క్వారీ రామారావు 2000ల మాస్క్‌లను గ్రామస్తులకు అందజేయగా ఎస్‌ఐ చల్లా సురేష్‌ వాటిని పంపిణీ చేసి మాట్లాడారు.

కాకుమాను ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో..
నరసరావుపేట: కరోనా వ్యాప్తి నిరోధానికి అహర్నిశలు పాటుపడుతున్న పోలీసు సిబ్బందికి కాకుమాను ఫౌండేషన్‌ ప్రతినిధులు సోమవారం మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. యాచకులు, నిరాశ్రయులకు భోజన పాకెట్లు అందజేశారు. ఫౌండేషన్‌ చైర్మన్‌ కాకుమాను సదాశివరెడ్డి మల్లమ్మసెంటర్, రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, పలనాడురోడ్డులలోని సుమారు 400మంది యాచకులకు టుటౌన్‌ సీఐ కృష్ణయ్య చేతుల మీదుగా భోజన పాకెట్లను పంపిణీ చేశారు. బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్‌ ఆధ్వర్యంలో సత్తెనపల్లిరోడ్డులోని విజయ కల్యాణ మండపంలో లాక్‌డౌన్‌లో విధులు నిర్వహిస్తున్న సుమారు 150మంది పోలీసులు, సచివాలయ సిబ్బందికి భోజన వసతి కల్పించారు. సింగరాజు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చైర్మన్‌ డాక్టర్‌ సింగరాజు సాయికృష్ణ నాక్‌డౌన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి వైద్యసేవలు అందించారు.

బాపట్లలో..
బాపట్ల: పట్టణంలో భిక్షాటన చేసుకుని జీవించే వారికి సీబీజడ్‌ చర్చి సంఘ సభ్యులు ఆహార ప్యాకెట్లు అందించారు. సోమవారం పేడిసన్‌పేట యూత్‌ ఆధ్వర్యంలో అల్పాహారం అందించటంతోపాటు ఆహార ప్యాకెట్లును అందించారు. సంఘ కాపరి సాధుహెర్బర్ట్,  రెవ.జి.ఇమ్మానియేలురాజు, సంఘ ఉపకార్యదర్శి డి.మోజెస్, సంఘ పెద్దలు జె.క్రిష్టాఫర్,టి.జాన్‌నాక్స్‌ తదితరులు ఉన్నారు.  

మజ్జిగ పంపిణీ  
రెంటచింతల: స్థానిక వైఎస్సార్‌ కాంస్య విగ్రహం వద్ద మధర్‌థెరిస్సా సేవా సమితి మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన మజ్జిగను ఎస్‌ఐ చల్లా సురేష్‌ పంపిణీ చేశారు. మదర్‌ థెరిస్సా సేవా సమితి మండల అధ్యక్షుడు దుగ్గింపూడి శౌరిరాయపురెడ్డి, తుమ్మా అంథోన్‌రెడ్డి, అల్లం శౌరీలు, దుగ్గింపూడి అగతమ్మ, వై.విజయలక్ష్మి, కె.వినయ్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కూరగాయల పంపిణీ
కారంపూడి: మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలందరికీ వైఎస్సార్‌సీపీ మండల నేత వెలుగూరి శేషారావు, ఆయన పెద్ద కుమార్తె రేణుకలు లక్షన్నర విలువైన కూరగాయలు, గోధుమ పిండి ప్యాకెట్లు సోమవారం పంపిణీ చేశారు. పెదకొదమగుండ్ల గ్రామానికి చెందిన శేషారావు పెదకొదమగుండ్ల, కాకానివారిపాలెం, బ్రహ్మనాయుడు కాలనీ, రెడ్డిపాలెం గ్రామాలలోని అన్ని కుంటుంబాలకు కూరగాయలు, గోధుమ పిండి పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి గోధుమ పిండి కిలో, టమాటాలు, గోడు చిక్కుళ్లు, దొండ కాయలు, బెండకాయలు ఒక్కొక్కటి ఒక కిలో చొప్పున ప్రతి కుటుంబానికి నాలుగు కిలోల కూరగాయలు అందించారు. వైఎస్సార్‌సీపీ నేతలు మందాళ్ల అంజిరెడ్డి, అల్లు వెంకటేశ్వరరెడ్డి (నీటి సంఘం), అల్లు వెంకటేశ్వరరెడ్డి, అంబటి శ్రీనివాసరెడ్డి, వెలుగూరి వెంకటరత్నం, చింతా రమణ, వెంకటేశ్వర్లు, గుండా కోటేశ్వరరావు,లక్ష్మీనారాయణ, ఆశీర్వాదం ఉన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top