అందరి నోట ఒకటే మాట జగనే సీఎం కావాలని..

Peoples Want To YS Jagan Become CM - Sakshi

విశాఖపట్నం : సుమారు 11 నెలలుగా ఎండనక, వాననకా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు సీఎం అయ్యే అవకాశం ఇవ్వాలని దేవుడిని ప్రార్థించాను. ఆయన్ని పప్పలవానిపాలెం వద్ద నా భార్య భాగ్యవల్లితో కలసి ప్రసాదం ఇచ్చాను. ఆయనకు ప్రజా బలం ఉంది. ప్రజా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.– ఇరగవరపు వేదాద్రి నరసింహాచార్యులు, భీమేంద్రపాలెం

ఇప్పటి వరకు విన్నాం.. ఇప్పుడు కళ్లారా చూశాం
మేము ఆనందపురం మండలం, కొలవానిపాలెం ఎంపీపీ స్కూల్‌ విద్యార్థులం. స్కూల్‌కు వెళుతూ కాబోయే సీఎం జగనన్నను చూడాలని వచ్చాం. టీవీలు, పేపర్ల లో ఆయన గురించి గొ ప్పగా విన్నాం. పాదయాత్రలో పప్పలవానిపాలెం సమీపంలో కలిశాం. చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. ఆయన సీఎం అయ్యాక మా స్కూల్‌ను అభివృద్ధి చేయాలని కోరాం.    

ఓపిక ఉన్నంత వరకు పోషిస్తా..తర్వాత భారం నీదే..
‘జగన్‌ బాబు నాది పేద కుటుంబం. నా కొడుకు సాయిపేట నాగేంద్ర రెడ్డికి ఆరోగ్యం బాగోలేదు. అతని బాగోగులు నేనే చూసుకో వాలి. వైద్యం కోసం చాలా ఖర్చవుతోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. నిన్నే నమ్ముకుని కడప నుంచి వచ్చాను. నాకు ఓపిక ఉన్నంత వరకు ఏదోలా పోషిస్తాను. ఆ తర్వాత నా కొడుకు బాగోగులు చూసే బాధ్యత నువ్వే తీసుకోవాలి నాయనా’ అంటూ మునిలక్ష్మమ్మ కొలవానిపాలెం వద్ద వైఎస్‌ జగన్‌ను కలసి తన గోడు వినిపించారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.                 – ముని లక్ష్మమ్మ, కడప

మహిళలకు రిజర్వేషన్‌ కల్పించిన ఘనత వైఎస్‌దే
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్‌దే. ఆయ న ప్రోత్సాహంతోనే వి జయనగరం మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాను. ఆయన హ యాంలో విజయనగరం మున్సిపాలిటీలో నేను ప్రాతినిథ్యం వహిం చిన వార్డులో 200 మందికి పింఛన్లు, 150 మందికి పక్కా గృహాలు మంజూరు చేయించగలిగాను. అభివృద్ధి అంతా వైఎస్‌ హయాం లోనే జరిగింది. మళ్లీ ఆ పాలన రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జిల్లా దాటి వచ్చి జననేతను కలసి సమస్యలు వివరిం చాను. ఈ ప్రభుత్వ హయాంలో వార్డుకు పది మందికి కూడా పింఛన్లు, ఇల్లు మంజూరు చేయడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లాను.– మంచాల శివానీ,మాజీ కౌన్సిలర్, విజయనగరం

రాష్ట్రానికి జగనన్న దిక్సూచి
రాష్ట్ర ప్రజలు నాలుగున్నరేళ్లుగా సంక్షేమ పథకాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడు వారికి ఊరట కలిగించాలంటే మళ్లీ రాజన్న లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి. ఆయన ఆశయాలను నెరవేర్చే దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. జననేతకు మా వంతు సాయంగా పాదయాత్రలో పాల్గొంటున్నాం.   –కొత్త చిన్నప రెడ్డి, వింత శివనాగిరెడ్డి, వి.భాస్కరరెడ్డి

దమ్మున్న నాయకుడు జగన్‌
మేం కొంత మంది కలసి గుంటూరు నుంచి వచ్చి కొలవానిపాలెం వద్ద ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశాం. ఆయనకు మా సమస్యలు చెప్పుకున్నాం. సుమారు 3 వేలు కిలో మీటర్లు నడిచాడంటే వైఎస్‌ జగన్‌ దమ్మున్న నాయకుడని అందరికీ అర్థం అవుతుంది. ఆయన కచ్చితంగా సీఎం అవుతారు. ప్రజల ఆశీస్సులు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. –గాదె వెంకట సుబ్బారెడ్డి, గుంటూరు

సిగ్నల్స్‌ రాక అవస్థలు
‘మాది ఆనందపురం మండలం రామవరం. ఇక్కడ ఫోన్లు పనిచేయవు.  సిగ్నల్స్‌ పూర్తి స్థాయిలో రావు. రవాణా వ్యవస్థ అధ్వానంగా ఉంది. ’ అంటూ ఆ గ్రామానికి చెందిన శైలజతో పాటు పలు వురు మహిళలు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలసి తమ గోడు వినిపించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి అంబులెన్స్‌కు ఫోన్‌ చేద్దామన్నా.. అవకాశం లేకుండా పోతోందన్నారు. గ్రామానికి చెందిన హేమశ్రీ అనే గర్భిణీకి ప్రసవ నొప్పులు వస్తే..అంబులెన్స్‌కు కాల్‌ చేయడానికి చాలా సమయం పట్టిందన్నారు. ఆటోలో తీసుకెళుతుండగా మధ్యలో అంబులెన్స్‌ ఎదురైందని, దానిలోకి మార్చిన తర్వాత అందులోనే ప్రసవం జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు.

రాష్ట్రాన్ని నడిపించే సత్తా జగన్‌కే ఉంది
రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్, సంక్షేమ పథకాలు అందించక టీడీ పీ ప్రజలను దిక్కులేని వారిని చేశాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం పూర్తయితే రాష్ట్రం వ్యవసాయరంగంలో ముందుకు దూసుకుపోతుంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే సత్తా గల నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నా.. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగా లన్నా జననేత సీఎం కావాలి. ఆయనకు ప్రజా బలం సంపూర్ణంగా ఉంది.– తలసాని అశోక్‌రెడ్డి, పుట్టపర్తి

జగన్‌ సీఎం కావాలన్నదే ప్రజల ఆకాంక్ష
నేను వలంటీర్‌గా ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని ప్రజల నాడీ తెలుసుకునేందుకు ప్ర యత్నించాను. గ్రామాలు, పట్టణాలు, బస్, రైల్వే స్టేషన్లు, హోటళ్లు ఇలా అన్ని ప్రాంతాల్లో వివిధ వర్గాలకు చెందిన సుమారు 50 వేల మంది అభిప్రాయాలు సేకరించాను. 80 శాతం మంది ప్రజలు టీడీపీని పూర్తిగా వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థు లు, రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. టీడీపీ పాలన అంతా మోసపూరితం అని, ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.  నేను సేకరించిన పీపుల్స్‌ మౌత్‌ టాక్‌ సర్వే నివేదికను జగనన్నకు అందజేశాను.– ఎం.నటేష్‌కుమార్, వాల్మీకి, గుట్టూరు, అనంతపురం జిల్లా

టీడీపీ హామీ ఇచ్చి మోసం చేసింది
పద్మనాభం అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చెందిన భూములను తరతరాలుగా సేద్యం చేసుకుని జీవిస్తున్నాం. పద్మనాభం టీడీ నం.1009, కృష్ణాపురం టీడీ నం. 674లలో 2488 ఎకరాలు భూములు ఉండగా 720 ఎకరాల సేద్యపు భూములు ఉన్నాయి. వీటిపై 380 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇందులో సుమారు 240 ఎకరాల్లో 160 మంది రైతులకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సర్వే చేయించి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. వీటికి టైటిల్‌ డీడ్స్‌ ఇస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ తర్వాత పట్టించుకునే నాథుడే లేదు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే మాకు పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఆయన్ని కోలవానిపాలెం వద్ద పాదయాత్రలో కలసి సమస్యను వివరించాం.            – టి. పద్మనాభ, రైతు, కృష్ణాపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top