పింఛన్లు అందడం లేదు

Peoples Request To YS Jagan Mohan Reddy In Srikakulam - Sakshi

‘బాబూ.. గ్రామాల్లో పేదవారికి పింఛన్లు అంద డం లేదు. మా మరిది బధిరుడు. ఇంటి నుంచి బయటకు రాలేడు. కానీ అతనికి పింఛన్‌ ఇవ్వ డం లేదు’ అని టెక్కలి మండలం రావివలసకు చెందిన బెవర రోజా జగన్‌ను కోరారు. దరఖా స్తులు చేయడమే తప్ప పరిష్కారం లభించడం లేదని తెలిపారు. 

 కేబుల్‌ ఆపరేటర్లతో ఆటలు 
‘అయ్యా ప్రభుత్వం కేబుల్‌ ఆపరేటర్ల జీవితాలతో ఆటాలాడుకుంటోంది. ప్రభుత్వం ఏపీ పైబ ర్‌ నెట్‌వర్క్‌ ప్రవేశ పెట్టడంతో మాకు ఇబ్బందులు తప్పడం లేదు.’ అని రణస్థలం మండలం రావాడకు చెందిన లంక రమణ జగన్‌తో అన్నారు. వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుడినని తనకు పైబర్‌ నెట్‌వర్క్‌ కనెక్షన్‌ ఇవ్వడం లేదని తెలిపారు.  

 బీమా కల్పించాలన్నా.. 
‘అన్నా.. గొర్రెలు, మేకలకు బీమా సౌకర్యం కల్పించి యాదవులకు ఆదుకోవాలి’ అని టెక్క లి మండలం రావివలసకు చెందిన దాసరి రాజు లు జగన్‌ను కోరారు. టీడీపీ వచ్చాక బీమా పథ కం తొలగించారని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో గొర్రెలు, మేకలు చనిపోయి యాదవులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు.  
 
అర్హులకు అన్యాయం 
‘అన్నా.. తిత్లీ తుపాను నష్టపరిహారం మంజూ రులో అర్హులకు అన్యాయం జరిగింది. మా గ్రామంలో వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల పేర్లను జాబితాల నుంచి తొలగించారు’ అని రావివలసకు చెందిన చామంతి బాలసుబ్రహ్మణ్యం జగన్‌కు చెప్పారు. ఇళ్లు, పశువుల శాలలు, పంటలు, చెట్లకు తీవ్ర నష్టం జరిగినా ఒక్క పైసా కూడా మంజూరు కాలేదన్నారు. 

ఇల్లు కావాలి 
‘అన్నా.. ఇల్లు లేక అద్దె ఇంటిలో ఉంటున్నాం. ఎలాంటి జీవనాధారం లేదు’ అని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన ఎం.స్వప్న జగన్‌ను కోరారు. అధికారులు, నాయకులు తమ గోడు వినడం లేదని అన్నారు. తమ లాంటి వారికి న్యాయం చేయాలని కోరారు.  
 
సిఫార్సు కావాలంట.. 
‘అన్నా.. డిగ్రీ విద్యార్థులకు హాస్టల్‌ సదుపా యం కావాలంటే మంత్రి అచ్చెన్నాయుడు సిఫా ర్సు కావాలని అడుగుతున్నారు’ అని నాయుడుపేటకు చెందిన నీలాపు సుధాకర్‌ జగన్‌కు తెలి పారు. తాను నిరుపేద కుటుంబానికి చెందిన వాడినని, శ్రీకాకుళం హాస్టల్‌లో సీటు కావాలని అడిగినా ఇవ్వడం లేదని తెలిపారు. తనలాంటి వారిని ఆదుకోవాలని కోరారు.  

జగనే సీఎం కావాలి 
జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలంటూ విశాఖపట్నంకు చెందిన చిన్నారి అన్విత పాదయాత్రగా వెళుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పాట పాడింది. అనంతరం వైఎస్సార్‌ సీపీ జెండా, జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖర రెడ్డి చిత్రపటాలతో కూడిన బహుమతిని అందించింది.  

 మహిళలకు అండగా నిలవాలి
‘అన్నా.. మహిళలకు అండగా నిలవాలి. మహిళా సంక్షేమ పథకాల ను రూపొందించాలి’ అని టెక్కలి కి చెందిన గూన హేమ, పద్మావతి, మాధవి తదితరులు జగన్‌తో అన్నారు. మీరు సీఎం అయిన తర్వాత ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టాలని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top